- Telugu News Photo Gallery Cinema photos Kantara 2, Avatar 3 war 2 Dubbed Films Threatening Telugu Box Office
టాలీవుడ్‌పై డబ్బింగ్ సినిమాల దండయాత్ర మళ్లీ మొదలు
డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకోడానికి లేదు.. కొన్నిసార్లు ఆ అనువాదాలే మన సినిమాలకు గుదిబండలా మారుతుంటాయి. అలాంటి సెన్సేషనల్ సినిమాలు రాబోయే 5 నెలల్లో మూడు రానున్నాయి. వాటి విడుదల సమయంలో కచ్చితంగా మన నిర్మాతలకు కూడా కంగారు తప్పదు. మరి అంతగా భయపెడుతున్న ఆ డబ్బింగ్ సినిమాలేంటి..?
Updated on: Aug 02, 2025 | 12:59 PM

డబ్బింగ్ సినిమాల టైమ్ ఇప్పుడు నడవట్లేదు గానీ వాటికి టైమ్ వచ్చినపుడు మాత్రం మామూలుగా ఉండదు. మన సినిమాలను సైతం కంగారు పెడుతున్న అనువాద సినిమాలు రాబోయే 5 నెలల్లో మూడున్నాయి. వాటిలో మొదటికి ఆగస్ట్ 14నే రానుంది.. అదేంటో చెప్పనక్కర్లేదు.. దట్ ఈజ్ కూలీ.

లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి.బిజినెస్ పరంగానూ తెలుగులో కూలీ రికార్డులు తిరగరాస్తుంది. వార్ 2 కూడా డబ్బింగే అయినా.. NTR ఉన్నారు కాబట్టి అది మన సినిమానే.

ఇక అక్టోబర్ 2న కాంతార 2తో టాలీవుడ్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు రిషబ్ శెట్టి. పేరుకు కన్నడ సినిమా అయినా.. తెలుగులో 100 కోట్ల పొటెన్షియల్ ఉంది కాంతారా 2కు. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం దీనికి మరింత ప్లస్ అయింది.

డిసెంబర్‌లో మరో భారీ డబ్బింగ్ సినిమా రాబోతుంది.. దాని పేరు అవతార్ 3. జేమ్స్ కామెరూన్‌ను ఎప్పుడూ మన వాళ్లు ఎప్పుడూ పరాయి వాడిలా చూడలేదు.

నాటి టైటానిక్ నుంచే ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక అవతార్ 3 డిసెంబర్ 19న రానుంది. మొత్తానికి ఈ మూడు సినిమాల నుంచి కచ్చితంగా ఆ టైమ్‌లో విడుదల కానున్న మన సినిమాలకు పోటీ తప్పదు.




