- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda Saya About Arjun Reddy Movie Remuneration in Kingdom Movie Promotions
Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాకు నా రెమ్యునరేషన్ అంతే.. విజయ్ దేవరకొండ..
కింగ్డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా రోజులు గుర్తుచేసుకున్నారు.
Updated on: Aug 02, 2025 | 1:58 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు విజయ్. ఆ తర్వాత 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో రౌడీ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అప్పట్లో విధ్వంసమే సృష్టించింది.

కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే విజయ్ రేంజ్ మారింది. చాలా కాలం తర్వాత విజయ్ నటించిన కింగ్డమ్ మూవీ ఇప్పుడు రికార్డ్స్ కొల్లగొడుతుంది.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.53 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి సినిమా విషయాలు గుర్తుచేసుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాకు తన రెమ్యునరేషన్ రూ.5 లక్షలు అని.. ఆ సమయంలో తనకు పెద్ద అమౌంట్ అని అన్నారు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ జోడిగా షాలిని పాండే కథానాయికగా నటించింది.




