- Telugu News Photo Gallery Cinema photos Heroine Aditi Rao Hydari New black dress Photos Goes Viral in social media on July 2024 Telugu Actress Photos
Aditi Rao Hydari: బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్.. క్యూట్ గా మెప్పిస్తున్న అదితి రావు..
"అదితి రావు హైదరీ".. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో చిత్రాలు 30కిపైగా చిత్రాలు చేసింది ఈ అమ్మడు. 2009లో ‘ఢిల్లీ 6’ అనే సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. రాక్‌స్టార్, మర్డర్ 3, ఫిటూర్, పద్మావత్, భూమి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి రావు హైదరి. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 KMPH’, ‘V’, ‘మహా సముద్రం’ లాంటి చిత్రాలు చేసింది.
Updated on: Jul 23, 2024 | 3:49 PM

"అదితి రావు హైదరీ".. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో చిత్రాలు 30కిపైగా చిత్రాలు చేసింది ఈ అమ్మడు. 2009లో ‘ఢిల్లీ 6’ అనే సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది.

రాక్‌స్టార్, మర్డర్ 3, ఫిటూర్, పద్మావత్, భూమి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి రావు హైదరి. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 KMPH’, ‘V’, ‘మహా సముద్రం’ లాంటి చిత్రాలు చేసింది.

ఇక ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’, ‘లయనెస్స్’ అనే సినిమాలు చేస్తోంది. మీరూ అదితిరావు హైదరీ లేటెస్ట్ ఫోటోలు చూసేయండి మరి.

మొన్న మొన్నటిదాకా ప్రేమ, నిశ్చితార్థ వార్తల్లో ఉన్న అదితిరావు హైదరి ఇప్పుడు ఉన్నపళంగా వర్క్ బేస్డ్ న్యూస్‌తో నార్త్ లో హల్‌చల్ చేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేగానీ కొన్ని పాత్రలు చేయలేం అని అంటున్నారు అదితిరావు హైదరి.

ఉన్నపళంగా ఆమె ట్రెండింగ్‌లోకి ఎందుకు వచ్చినట్టు..? సంజయ్ లీలా భన్సాలితో పరిచయమే తన అదృష్టమని అంటున్నారు నటి అదితిరావు హైదరి.

అదితి రావు హైదరీ.. ప్రస్తుతం హీరామండి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అదితి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అటు తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.




