- Telugu News Photo Gallery Cinema photos Hero Nani's saripodhaa sanivaaram Movie Teaser review in Telugu Telugu Heroes Photos.
Saripodhaa Sanivaaram: మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్.. ఇప్పుడు నాని సినిమాలో.!
రీసెంట్‌గా చూసిన ఇండియన్ 2, ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్, ఇండియన్ 3లోనే కాదు.. పెద్ద సినిమాలన్నిటిలోనూ కనిపిస్తున్నారు ఎస్.జె.సూర్య. మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్ సినిమాగా పేరు తెచ్చుకుంటున్నారు. డైరక్షన్‌ని పూర్తిగా పక్కనపెట్టి యాక్టింగ్ వైపే ఫోకస్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే సార్.. అంటూ సరిపోదా శనివారం టీమ్ రిలీజ్ చేసిన టీజర్ టాక్ ఏంటి.? అనగనగా ఒక ఊరిలో ఓ రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు నరకాసురుడు.
Updated on: Jul 23, 2024 | 3:31 PM

రీసెంట్‌గా చూసిన ఇండియన్ 2, ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్, ఇండియన్ 3లోనే కాదు.. పెద్ద సినిమాలన్నిటిలోనూ కనిపిస్తున్నారు ఎస్.జె.సూర్య. మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్ సినిమాగా పేరు తెచ్చుకుంటున్నారు.

ఆగస్టు 29న నేచురల్‌స్టార్‌లో చూసేయండి అని హింట్ ఇచ్చేశారు మేకర్స్. నా అనుకుంటే కొందరికి కోపం రావడాన్ని చూసే ఉంటాం.. కానీ నేచురల్ స్టార్‌కి కోపం వస్తే ఆ సమస్యను అతను నా అనుకున్నట్టే.. ఇదీ సరిపోదా శనివారం స్పెషల్ థీమ్.

అతన్ని మట్టుబెట్టడం కోసం శ్రీకృష్ణుడు సత్యభామను తోడుగా తీసుకుని రంగంలోకి దూకుతాడు.. ఇదీ కాన్సెప్ట్. ఇక్కడ శ్రీకృష్ణుడు నాని అయితే, నరకాసురుడు ఎస్.జె.సూర్య.. ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో టీజర్ మొత్తం హిందీలో సాగింది.

ఒక్కసారి పేరు రాసుకుంటే, వాళ్ల అంతు చూడటానికి ఎంత దూరమైనా వెళ్లే కేరక్టర్‌లో కనిపిస్తారు నేచురల్ స్టార్. యుద్ధానికి రంగం సిద్ధం సిద్ధం అంటూ.. శనివారం మాత్రమే కొట్టే హీరో గురించి డీటైల్డ్ గానే చెప్పేసింది ట్రైలర్.

విలన్ బర్త్ డేకి హీరోకి ఎలివేషన్ ఇస్తూ, హ్యాపీ బర్త్ డే సార్ అంటూ టీజర్ రిలీజ్ చేయడం బావుందనే అంటున్నారు నెటిజన్లు. సరిపోదా శనివారం పాటలను కూడా పనిలో పనిగా గుర్తుచేసుకుంటున్నారు. ఆగస్టు 29న విడుదల కానుంది సరిపోదా శనివారం.

ఆల్రెడీ దసరాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాని, ఈ మూవీతో ప్యాన్ ఇండియా మార్కెట్ మీద గట్టిగానే దండయాత్ర చేయాలని సిద్ధమవుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించినంత వైవిద్యం, మూవీ కంటెంట్‌లోనూ ఉంటే హిట్ పక్కా అంటున్నారు క్రిటిక్స్.




