- Telugu News Photo Gallery Cinema photos Drishyam movie completes ten years and still gets Box Office collections by remakes
Drishyam: పదేళ్లైనా తగ్గని పవర్.! అక్కడ కూడా సత్తా చూపించనున్న దృశ్యం..
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. వెళ్లిన ప్రతీచోట సంచలనం సృష్టిస్తుంది. రీమేక్ చేసిన ప్రతీచోట దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసిన ఆ సినిమా ఇప్పుడు హాలీవుడ్‌కు వెళ్తుంది. ఎంతసేడూ అక్కడి సినిమాలు రీమేక్ చేయడమే తెలిసిన మనకు.. మొదటిసారి మన సినిమా హాలీవుడ్‌కు వెళ్తుంది. మరి ఇన్ని రికార్డ్స్ తిరగరాసిన ఆ సినిమా ఏంటి..?
Updated on: Mar 05, 2024 | 3:54 PM

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. వెళ్లిన ప్రతీచోట సంచలనం సృష్టిస్తుంది. రీమేక్ చేసిన ప్రతీచోట దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసిన ఆ సినిమా ఇప్పుడు హాలీవుడ్‌కు వెళ్తుంది. ఎంతసేడూ అక్కడి సినిమాలు రీమేక్ చేయడమే తెలిసిన మనకు.. మొదటిసారి మన సినిమా హాలీవుడ్‌కు వెళ్తుంది. మరి ఇన్ని రికార్డ్స్ తిరగరాసిన ఆ సినిమా ఏంటి..?

సినిమా వచ్చి పదేళ్లైనా ఇంకా పవర్ తగ్గలే..! ఈ డైలాగ్ దృశ్యం సినిమాకు బాగా సరిపోతుంది. 2013లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం చరిత్ర సృష్టించింది. కుటుంబాన్ని కాపాడుకోడానికి ఓ ఇంటి యజమాని పడే కష్టమే దృశ్యం. ఆ స్క్రీన్ ప్లేకు అన్ని భాషల్లోని ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా దృశ్యం మరో అరుదైన రికార్డు సాధించింది.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో రీమేక్ అయి అన్నిచోట్లా విజయం సాధించింది దృశ్యం. ఆ తర్వాత చైనీస్, కొరియన్, ఇండోనేషియాల్లో రీమేక్ చేసిన తొలి భారతీయ సినిమాగా దృశ్యం చరిత్ర తిరగరాసింది.

ఇక ఇప్పుడు హాలీవుడ్‌కు వెళ్తుంది దృశ్యం. ఓ ఇండియన్ సినిమా హాలీవుడ్‌లో రీమేక్ అవ్వడం ఇదే తొలిసారి. గల్ఫ్ స్ట్రీమ్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నారు. తరువాలనే విడుదల కూడా కానుంది.

దృశ్యం సీక్వెల్ కూడా సూపర్ హిట్ అయింది. పార్ట్ 3 కూడా త్వరలోనే రాబోతుంది. ఇలాంటి సమయంలో దృశ్యంను ఇంగ్లీష్‌లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇన్నాళ్లూ హాలీవుడ్ సినిమాల్ని మనోళ్లు రీమేక్ చేసారు. ఇప్పుడు మన దృశ్యంను కోరిమరీ హాలీవుడ్ వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇది హిట్టైతే.. దృశ్యం 2 కూడా రీమేక్ కావడం ఖాయం.