- Telugu News Photo Gallery Cinema photos Aaradhya Bachchan flaunts new hairstyle for Anant and Radhika's pre wedding bash
అందంలో తల్లికి పోటీ ఇస్తున్న ఆరాధ్య బచ్చన్.. ఎంత ముద్దుగా ఉందో
ప్రపంచ అందగత్తెల లిస్ట్ తీస్తే అందులో ఐశ్వర్య రాయ్ ముందు వరసలో ఉంటారు. వయసు పెరుగుతోన్న తరగని అందంతో కవ్విస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికి కుర్రాళ్ళు తమ కలల రాణి అంటూ ఐశ్వర్య రాయ్ తెగ పొగిడేస్తూ ఉంటారు.
Updated on: Mar 05, 2024 | 3:22 PM

ప్రపంచ అందగత్తెల లిస్ట్ తీస్తే అందులో ఐశ్వర్య రాయ్ ముందు వరసలో ఉంటారు. వయసు పెరుగుతోన్న తరగని అందంతో కవ్విస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికి కుర్రాళ్ళు తమ కలల రాణి అంటూ ఐశ్వర్య రాయ్ తెగ పొగిడేస్తూ ఉంటారు.

ప్రపంచ సుందరిగానే కాకుండా సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించారు ఐశ్వర్య రాయ్. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అందగత్తె .. అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే అప్పుడప్పుడు పార్టీలు, ఫంక్షన్ లలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.

తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చివరి రోజు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ హాజరయ్యారు. ఈ వేడుకకు తన కూతురితో కలిసి కనిపించింది ఐశ్వర్య రాయ్. ఐష్ కూతుర్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

అభిషేక్, ఐశ్వర్య గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇలా తల్లితో కలిసి కనిపించింది. ఐష్ కు అందంలో పోటీ ఇస్తుంది ఆరాధ్య బచ్చన్. ఆరాధ్య అందం చూసి నెటిజన్లు ..గ్లామర్ లో తల్లిని మించిపోయేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




