- Telugu News Photo Gallery Cinema photos Anil Ravipudi is all set for a hat trick movie with Venkatesh
Anil Ravipudi: జస్ట్ ఛిల్ల్.! నో టెన్షన్.. సంక్రాంతికి వస్తున్నాం అంటున్న అనిల్..
భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి ఎందుకు సైలెంట్ అయ్యారు..? అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా ఈ దర్శకుడు కామ్‌గా ఉండటానికి కారణమేంటి..? నెక్ట్స్ సినిమా ఖరారవ్వలేదా లేదంటే హీరో ఓకే అయినా.. కథ సెట్ అవ్వలేదా..? అదీ కాక ఏదైనా మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్నారా..? అసలు అనిల్ తర్వాతి ప్లాన్ ఏంటి..? నెక్ట్స్ సినిమా గురించి చెప్పమని అభిమానులు అడుగుతుంటే.. అనిల్ రావిపూడి మాత్రం ఆ కంగారేం లేకుండా హాయిగా ఇదిగో ఇలా స్టెప్పులేసుకుంటున్నారు.
Updated on: Mar 05, 2024 | 4:14 PM

భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి ఎందుకు సైలెంట్ అయ్యారు..? అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా ఈ దర్శకుడు కామ్‌గా ఉండటానికి కారణమేంటి..? నెక్ట్స్ సినిమా ఖరారవ్వలేదా లేదంటే హీరో ఓకే అయినా.. కథ సెట్ అవ్వలేదా..? అదీ కాక ఏదైనా మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్నారా..? అసలు అనిల్ తర్వాతి ప్లాన్ ఏంటి..?

నెక్ట్స్ సినిమా గురించి చెప్పమని అభిమానులు అడుగుతుంటే.. అనిల్ రావిపూడి మాత్రం ఆ కంగారేం లేకుండా హాయిగా ఇదిగో ఇలా స్టెప్పులేసుకుంటున్నారు. ఏం చేయాలో క్లారిటీ ఉన్నపుడు కంగారు పడి లాభం లేదనేది అనిల్ ఫార్ములా. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. ఈయన తర్వాతి సినిమా వెంకటేష్‌తో ఖరారైపోయింది.. దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకుంటున్నారు.

వెంకటేష్‌తో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేసారు అనిల్ రావిపూడి. కొన్నేళ్లలో వెంకీలోని కామెడీ యాంగిల్‌ను ఈ స్థాయిలో మరే దర్శకుడు వాడలేదు. ఇప్పుడు ఈ కాంబోలో మూడో సినిమా రాబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇందులో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ, రవితేజ అతిథి పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎలాగూ బాలయ్య, రవితేజకు అనిల్‌తో మంచి స్నేహం ఉంది. పైగా ఇద్దరికీ హిట్స్ ఇచ్చిన దర్శకుడాయే.. ఆయన అడిగితే నో చెప్పడానికేం లేదు.

అన్నీ కుదిర్తే సంక్రాంతి 2025కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నారు వెంకీ, బాలయ్య, రవితేజ. చూడాలిక ఏం జరగబోతుందో..? అయితే దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.




