- Telugu News Photo Gallery Cinema photos Director Prasanth varma confusion on Teja sajja Hanuman Movie Sequel Jai hanuman Movie details here Telugu Heroes Photos
Prasanth varma – Hanuman: నో కన్ఫ్యూజన్.! అనుకున్న టైం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కష్టమేనా.?
విజయం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు.. కావాల్సినంత కన్ఫ్యూజన్‌ను.. దానికి సరిపడా కంగారును కూడా మోసుకొస్తుంది. నమ్మరా..? ఎందుకు నమ్మరు చెప్పండి కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంటే..? హనుమాన్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్‌ను అనుకున్న టైమ్‌కు తేగలరా..? తేజ కోసమే మూడేళ్లు తీసుకున్న ప్రశాంత్.. స్టార్ హీరోతో చేయబోయే జై హనుమాన్‌ను ఏడాదిలో పూర్తి చేయగలరా.? హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది.
Updated on: Feb 22, 2024 | 2:19 PM

విజయం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు.. కావాల్సినంత కన్ఫ్యూజన్‌ను.. దానికి సరిపడా కంగారును కూడా మోసుకొస్తుంది. నమ్మరా..? ఎందుకు నమ్మరు చెప్పండి కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంటే..? హనుమాన్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్‌ను అనుకున్న టైమ్‌కు తేగలరా..?

తేజ కోసమే మూడేళ్లు తీసుకున్న ప్రశాంత్.. స్టార్ హీరోతో చేయబోయే జై హనుమాన్‌ను ఏడాదిలో పూర్తి చేయగలరా.? హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది.

300 కోట్ల విజయం ఖాతాలో వేసుకున్నా.. ఈ దర్శకుడికి కంగారు మాత్రం తప్పట్లేదు. జై హనుమాన్ చేయాలంటే స్టార్ హీరో ఖాళీగా ఉండాలి కానీ ఎవరూ లేరిప్పుడు. పోనీ వేరే సినిమా చేద్దాం అంటే.. అంత క్రేజ్ ఉంటుందా లేదా తెలియదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 2025 జనవరికి జై హనుమాన్ రావడం అసాధ్యం అనిపిస్తుంది. రఘునందన ఈజ్ కమింగ్ అంటూ ట్వీట్ చేసారు ప్రశాంత్. అయితే తేజా సజ్జాతో చేసిన హనుమాన్ కోసమే మూడేళ్లు తీసుకున్న ప్రశాంత్ వర్మ.

స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న జై హనుమాన్ ఒక్క ఏడాదిలో పూర్తి చేయగలరా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి.. జై శ్రీరామ్ పేరుతో ఓ టైటిల్ రిజిష్టర్ చేయించారు.. ఇదెవరి కోసం అనేది క్లారిటీ లేదు.

జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనా.. వచ్చే సంక్రాంతికి మాత్రం రావట్లేదని తెలుస్తుంది. జై హనుమాన్ రావడానికి మరింత టైమ్ పడుతుందని తేజ సజ్జా కూడా చెప్పారు.

ఈ లెక్కన ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్‌ని హోల్డ్‌లో పెట్టి.. వేరే స్క్రిప్ట్‌పై కూర్చోవాల్సిందే. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ కెరీర్ మాత్రం కన్ఫ్యూజన్‌లో పడింది.. మరి దీనిపై ఈ దర్శకుడు క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.




