- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress, She Is Now Top Heroine In South Industry, She Is Rukmini Vasanth
Tollywood : హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న ముద్దుగుమ్మ.. ఇప్పట్లో జోరు ఆగేలా లేదు..
ప్రస్తుతం దక్షిణాదిలో చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ ఆమె. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు సీనియర్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా.. ?
Updated on: Sep 27, 2025 | 1:42 PM

కన్నడ సినిమాలతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో అటు కన్నడ, ఇటు తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

రుక్మిణి వసంత్ 2019లో ఎం.జి. శ్రీనివాస్ తో కలిసి బీర్బల్ ట్రైలజీ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాల అవకాశాలు అందుకుంటుంది.

ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన కాంతార చాప్టర్ 1సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్రం అక్టోబర్ 2న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కాంతార చాప్టర్ 1 మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

మరోవైపు ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ నటిస్తుంది. అలాగే సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రాబోయే ప్రాజెక్టులోనూ ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. తాజాగా ఆమె చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.




