- Telugu News Photo Gallery Cinema photos Bimbisara 2 Sequel Update, Director Change and Release Date Speculation
Bimbisara 2: బింబిసార సీక్వెల్‌పై క్రేజీ న్యూస్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
కళ్యాణ్ రామ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ బింబిసారకు సీక్వెల్ చేస్తామని చెప్పారు కదా..? సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా ఆ ఊసే లేదెందుకు..? సీక్వెల్ ఐడియా మానుకున్నారా..? లేదంటే దర్శకుడు మారిపోయాడని బింబిసార 2 కూడా ఆగిపోయిందా..? అసలేం జరుగుతుంది..? తాజాగా ఈ సీక్వెల్‌పై క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
Updated on: Jul 23, 2025 | 5:49 PM

పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్‌కు ఏడేళ్ళ తర్వాత ఆ ఆకలి తీర్చిన సినిమా బింబిసార. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది.

జానపదం, ఫాంటసీ రెండూ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ నమ్మకంతోనే వశిష్టకు విశ్వంభర ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. బింబిసార విడుదలైనపుడే పార్ట్ 2 ఉందని చెప్పారు కళ్యాణ్ రామ్. నిజానికి 2024 లోపే ఈ సినిమా వస్తుందన్నారాయన.

వశిష్ట కూడా అప్పుడదే అన్నారు. కానీ టైమ్ మారుతున్న కొద్దీ సీక్వెల్ గురించి అంతా మరిచిపోయారు. కళ్యాణ్ రామ్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. బింబిసార తర్వాత డెవిల్, అమిగోస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి లాంటి సినిమాలు చేసారు.

బింబిసార వచ్చి మూడేళ్లైపోయినా మరో హిట్ కొట్టలేకపోయారు కళ్యాణ్ రామ్. దాంతో ఈ సీక్వెల్‌పై చర్చ మరోసారి మొదలైంది. అసలు బింబిసార 2 ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్. దీనికి దర్శకుడు వశిష్ట నుంచి క్లారిటీ వచ్చేసింది.. అనిల్ పడూరి సీక్వెల్‌ను తెరకెక్కిస్తారని.. కథ కూడా సిద్ధమైపోయిందని చెప్పారు ఈ దర్శకుడు.

బింబిసార 2 నుంచి తానెందుకు తప్పుకున్నాను అనే విషయాన్ని చెప్పారు దర్శకుడు వశిష్ట. పార్ట్ 2కు అనీల్ పదూరి దర్శకుడు. సీక్వెల్‌కు తనకంటే బెటర్ ఐడియాతో అనిల్ వచ్చారు కాబట్టి తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా దీనికి ఆయనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యామని తెలిపారు. తాను కూడా విశ్వంభరపై ఫుల్ ఫోకస్ పెట్టానన్నారు వశిష్ట.




