- Telugu News Photo Gallery Cinema photos Akkineni Nagarjuna Doing Multi Starrer Movie With Super Star Rajinikanth and Lokesh Kanagaraj combo Telugu Heroes Photos
Nagarjuna: మల్టీస్టారర్ అయితే ఏంటి? మరోటైతే ఏంటి? ఆడియన్స్ ఫీలింగ్ పై నాగ్.
అక్కినేని ఫ్యామిలీలో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా హల్‌చల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. నార్త్ టు సౌత్ ప్రామినెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకుంటూ, సరికొత్తగా దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా తలైవర్ రజనీకాంత్ సినిమాలో నాగార్జున యాక్ట్ చేస్తున్నారనే మాట వైరల్ అవుతోంది. ఆల్రెడీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జునను రజనీ సినిమాలో టెంప్ట్ చేసిన అంశమేంటనే చర్చలు మొదలయ్యాయి. కథ కొత్తగా ఉంటే చాలు.. మల్టీస్టారర్ అయితే ఏంటి? మరోటైతే ఏంటి?
Updated on: Apr 22, 2024 | 8:18 PM

నాగార్జున నెక్ట్స్ సినిమా ఏంటి..? నా సామిరంగా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? నేడో రేపో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో.

దీనికి ముందు చేసిన ఘోస్ట్ దారుణంగా నిరాశ పరిచింది. అయితే సంక్రాంతికి వచ్చినపుడు మాత్రం సత్తా చూపిస్తున్నారు నాగ్. 2021లో బంగార్రాజుతోనూ బంపర్ హిట్ కొట్టారు ఈ సీనియర్ హీరో.

అందుకే 2025 సంక్రాంతికి కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తానని ఆ మధ్య ప్రకటించారీయన. నాగార్జున ప్రస్తుతం హీరోగా సినిమాలేం చేయట్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు.

కథలో అతి ముఖ్యమైన పాత్ర ఇది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న కుబేరాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది సెట్స్‌పై ఉండగానే తాజాగా బిగ్ బాస్ 8పై అనౌన్స్‌మెంట్ ఇచ్చారు నాగ్.

ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటే, యంగ్ హీరోలతో కలిసి పనిచేయడానికి తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటుందనేది కింగ్ చెప్పే మాట. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట నాగ్.

సడన్‌గా బిగ్ బాస్ సీన్‌లోకి వచ్చేసిందిప్పుడు.. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీకి ఎంత టైమ్ పడుతుంది..? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున.

మల్టీస్టారర్స్ ని అద్భుతంగా డీల్ చేయగలరనే పేరు తెచ్చుకున్న లోకేష్.. ఇప్పుడు కింగ్ కోసం ఎలాంటి కేరక్టర్ డిజైన్ చేశారో అనే క్యూరియాసిటీ అభిమానుల్లో బాగా కనిపిస్తోంది.




