Kamal Haasan: సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న యూనివర్సల్ స్టార్ కమల్.! మళ్లీ సాలిడ్ స్ట్రాటజీ.
వేసవి ఆఖరున ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయిపోయారు కమల్‌హాసన్. విక్రమ్ సినిమాతో సరికొత్త సెంటిమెంట్‌ని అలవరచుకున్నారు యూనివర్శల్ స్టార్. సేమ్ సీన్‌ని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వేసవి ఎండలు కాస్త చల్లబడ్డాక, ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తే అంతా కూల్ కూల్‌గా ఉంటుందని ఫిక్స్ అయ్యారు కమల్‌హాసన్. కమల్‌హాసన్‌కి రీసెంట్ టైమ్స్ లో సూపర్‌డూపర్ హిట్ ఇచ్చిన సినిమా విక్రమ్.