బిజీ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నాని. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని జోరు మరింత పెరిగింది. గ్యాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని. ఆగస్ట్ 29న విడుదల కానుంది ఈ చిత్రం. అంటే సుందరానికి తర్వాత వివేక్‌తో నాని చేస్తున్న రెండో సినిమా ఇది.