- Telugu News Photo Gallery Cinema photos Movie Theaters remain empty without top movies in summer due to Election
Tollywood News: టాలీవుడ్ కు మరో షాక్.. థియేటర్స్ అన్నీ ఖాళీ.. అసలు ఏమైందంటే ??
ఇంతకంటే పరిస్థితులు దిగజారవేమో అనుకున్న ప్రతీసారి.. అంతకంటే దారుణమైన పరిస్థితులను చూస్తుంది టాలీవుడ్. మరీ ముఖ్యంగా ఎన్నికల కారణంగా సినిమాల్లేక అల్లాడిపోతున్న బాక్సాఫీస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పరిస్థితి మనకు కూడా వచ్చిందా అంటూ తల పట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ ఏంటా సిచ్యువేషన్..?సంక్రాంతికి మన సినిమాలు బాగానే మడతబెట్టాయి.. ఓ వైపు గుంటూరు కారం, మరోవైపు హనుమాన్, ఇంకోవైపు నా సామిరంగా దెబ్బకు వసూళ్ల వర్షం కురిసింది.
Updated on: Apr 22, 2024 | 1:43 PM

పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా స్క్రీన్ మీద సత్తా చాటుకుంటే ఓటీటీ సంస్థలు కాసింత ఓపిగ్గానే వ్యవహరిస్తున్నాయి. ఎనిమిదంటే, ఎనిమిది వారాల్లోనే ఓటీటీ రిలీజ్ చేసేస్తామని అనడం లేదు. థియేటర్లలో రన్‌ని గౌరవిస్తున్నాయి.

సంక్రాంతికి మన సినిమాలు బాగానే మడతబెట్టాయి.. ఓ వైపు గుంటూరు కారం, మరోవైపు హనుమాన్, ఇంకోవైపు నా సామిరంగా దెబ్బకు వసూళ్ల వర్షం కురిసింది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఫిబ్రవరి టూ ఏప్రిల్.. ఈ మధ్యలో టిల్లు స్క్వేర్ మాత్రమే బ్లాక్‌బస్టర్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్‌కు నిరాశ తప్పలేదు.

చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇప్పటికీ అదే టిల్లు, అదే మంజుమల్ బాయ్స్, అదే ఫ్యామిలీ స్టార్‌పై ఆధారపడుతున్నాయి థియేటర్స్. అవైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాయి చెప్పండి..? ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది. ఏప్రిల్ 19న అరడజన్ సినిమాలు వచ్చాయి.. కానీ ఒక్కటి కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.. టికెట్లు తెగట్లేదు.

అందుకే ఆక్యుపెన్సీ లేక షోస్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే వారం ప్రతినిధి 2, విశాల్ రత్నం లాంటి సినిమాలు రానున్నాయి. మరి అవైనా బాక్సాఫీస్ దగ్గర కాస్తో కూస్తో సందడి చేస్తాయేమో చూడాలి.




