Harish Shankar: నాతో పెట్టుకోకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కోసం రాసారు కానీ నిజం చెప్పాలంటే దర్శకుడు హరీష్ శంకర్‌కు కూడా బాగా సెట్ అవుతుంది. మనోడు మామూలుగానే స్ట్రెయిట్ ఫార్వర్డ్.. అలాంటి వాడిని టచ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. తాజాగా టాప్ సినిమాటోగ్రఫర్‌కు హరీష్ గట్టి కౌంటరే ఇచ్చారు. ఇంతకీ ఎవరాయన..? అసలు ఆయనేం చేసాడు..? ఈ లైన్ హరీష్ శంకర్‌కు పర్ఫెక్టుగా సరిపోతుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Apr 22, 2024 | 1:32 PM

నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కోసం రాసారు కానీ నిజం చెప్పాలంటే దర్శకుడు హరీష్ శంకర్‌కు కూడా బాగా సెట్ అవుతుంది. మనోడు మామూలుగానే స్ట్రెయిట్ ఫార్వర్డ్.. అలాంటి వాడిని టచ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది.

1 / 5
తాజాగా టాప్ సినిమాటోగ్రఫర్‌కు హరీష్ గట్టి కౌంటరే ఇచ్చారు. ఇంతకీ ఎవరాయన..? అసలు ఆయనేం చేసాడు..? ఈ లైన్ హరీష్ శంకర్‌కు పర్ఫెక్టుగా సరిపోతుంది. ఆయన జోలికొస్తే నిజంగానే మంటెక్కిపోతుంది వెదరూ. ఇప్పుడు ఇదే చేసారు ఈ దర్శకుడు.

2 / 5
 తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాప్ సినిమాటోగ్రఫర్ ఛోట కే నాయుడుపై ఓ బహిరంగ లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించారు హరీష్ శంకర్. ఈ లెటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. హరీష్ శంకర్ తెరకెక్కించిన రామయ్యా వస్తావయ్యాకి కెమెరా మెన్‌గా పని చేసారు ఛోటా.

3 / 5
ఆ సినిమా లొకేషన్స్‌లో దర్శకుడితో తనకు క్రియేటివ్ డిఫెరెన్స్ వచ్చిందని.. తను కొన్ని విషయాలు చెప్పాలని చూసినా వినే మూడ్‌లో లేడని ఛోటా చేసిన కామెంట్స్‌కు ఇప్పుడు హరీష్ కౌంటర్ ఇచ్చారు. వింటున్నారుగా.. ఈ కామెంట్స్‌కు డీప్‌గానే హర్ట్ అయ్యారు హరీష్.

4 / 5
సమయం సందర్భం లేకుండా తనపై కామెంట్స్ చేయొద్దని.. ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దంటూ కాస్త ఘాటుగానే స్పందించారు హరీష్ శంకర్. రామయ్యా వస్తావయ్యాకు కెమెరా మెన్‌ను మార్చాలనుకున్నా.. అలాగే అడ్జస్ట్ అయి పని చేసానని కౌంటర్ వేసారు. మొత్తానికి ఛోటాపై హరీష్ రిలీజ్ చేసిన లెటర్ ఇప్పుడు సంచలనం రేపుతుంది.

5 / 5
Follow us