- Telugu News Photo Gallery Calcium and Vitamin D: Red meat or egg Which of these compensates for vitamin D and calcium deficiency?
Red Meat and Egg: పాలల్లోనా.. రెడ్ మీట్‌లోనా..? కాల్షియం, విటమిన్ డీ ఎందులో ఎక్కువగా ఉంటుంది!
ఒక్కోసారి కాళ్లు, మోకాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఎక్కువ సేపు నిటారుగా కుర్చోవాలంటే వెన్ను నొప్పి, త్వరగా జబ్బు పడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది విటమిన్-డి, కాల్షియం లోపం వల్ల తలెత్తుతుంది..
Updated on: Aug 08, 2024 | 1:10 PM

ఒక్కోసారి కాళ్లు, మోకాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఎక్కువ సేపు నిటారుగా కుర్చోవాలంటే వెన్ను నొప్పి, త్వరగా జబ్బు పడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది విటమిన్-డి, కాల్షియం లోపం వల్ల తలెత్తుతుంది.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రోటీన్లు, విటమిన్లు, వివిధ ఖనిజాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండేందుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్-డి, క్యాల్షియం అవసరం. ఎముకల అభివృద్ధికి, పెరుగుదలకు, బలానికి కాల్షియం కావాలి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్-డి కూడా ముఖ్యమైనదే. రోగనిరోధక శక్తిని పెంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి విటమిన్-డి కూడా అవసరం.

అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరంలో విటమిన్-డి, కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఆహారంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్-డి, కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. రెడ్ మీట్ లో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు-ఎ, డి, బి-6, బి-12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.

USDA ప్రకారం.. గుడ్డులో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

మాంసాహారంతో పాటు, శాకాహార ఆహారంలో విటమిన్-డి, కాల్షియం తగిన స్థాయిలో ఉంటాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది సహజంగా విటమిన్-డి కలిగి ఉన్న ఏకైక సహజ కూరగాయలు. ఇందులో క్యాల్షియం కూడా ఉంటుంది.పానీయాలలో పోషకాలు అధికంగా ఉండేది పాలు. మాంసకృత్తులు, వివిధ విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.




