- Telugu News Photo Gallery Milk Powder for skin: 3 ways milk powder can give your skin a natural glow at home
Skin Care Tips: మిల్క్ పౌండర్‌తో మచ్చలేని సౌందర్యం మీ సొంతం.. ఎలా వాడాలంటే!
మిల్క్ పౌండర్‌ను సాధారణంగా వంటలో ఉపయోగిస్తారు. పాలపొడితో చేసిన పాలను చాలా మంది తాగుతుంటారు. కానీ పొడి పాలు ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. అయితే మిల్క్ పౌండర్‌తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే.. మిల్క్ పౌండర్‌లో లాక్టిక్ యాసిడ్, బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణ కల్పిస్తాయి..
Updated on: Aug 08, 2024 | 12:24 PM

మిల్క్ పౌండర్‌ను సాధారణంగా వంటలో ఉపయోగిస్తారు. పాలపొడితో చేసిన పాలను చాలా మంది తాగుతుంటారు. కానీ పొడి పాలు ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. అయితే మిల్క్ పౌండర్‌తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే.. మిల్క్ పౌండర్‌లో లాక్టిక్ యాసిడ్, బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

మిల్క్ పౌండర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడతాయి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అలాగే చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. మిల్క్ పౌండర్ కూడా ఒక సహజ పదార్ధం. మిల్క్ పౌండర్ దద్దుర్లు, దురద వంటి అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

మిల్క్ పౌండర్, శెనగపిండి, నారింజ రసం కలిపి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ స్క్రబ్‌ని చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి చేతులతో స్క్రబ్ చేసి, అనంతరం ముఖాన్ని కడగాలి. ఇది చర్మంపై ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.

మిల్క్ పౌండర్‌లో పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీన్ని చర్మంపై 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన కాంతిని తెస్తుంది.

మిల్క్ పౌండర్, ముల్తానీ మట్టి సమాన పరిమాణంలో తీసుకుని, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి చికిత్స అందిస్తుంది. ఇది చర్మంపై అదనపు నూనె, మురికిని శుభ్రపరుస్తుంది.




