- Telugu News Photo Gallery Best Weight Loss Drinks: These 2 drinks are very beneficial for weight loss
Best Weight Loss Drinks: కొబ్బరి బోండంలాంటి పొట్ట సన్నజాబి తీగలా మారాలా? అయితే ఈ డ్రింక్ పొద్దున్నే తాగండి
Weight Loss Drinks: నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ పెట్టడం లేదు. ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి కూడా సమయం లేకపోవడం వల్ల చాలా మంది విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది..
Updated on: Oct 15, 2025 | 8:31 PM

నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ పెట్టడం లేదు. ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి కూడా సమయం లేకపోవడం వల్ల చాలా మంది విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది.

దీంతో బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత రాత్రంతా నానబెట్టిన మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి, అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నిమ్మ రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనితో పాటు మెంతులు, జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి తాగాలి. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది.

మీరూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ప్రతి ఉదయం ఈ రెండు స్పెషల్ పానీయాలు ప్రయత్నించండి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.




