Andhra Pradesh: పేరుకే పొత్తులు.. పోరాటంలో ఎవరికీ వారే యమునాతీరే.. ఏపీలో హాట్ టాపిక్‌గా ఆ రెండు పార్టీల తీరు
Andhra Pradesh: పైకి పోత్తు ఉందంటారు.. పనులు మాత్రం వేరువేరంటారు.. ఏపీలో ప్రస్తుతం జనసేన(Janasena), బీజేపీ(BJP) పరిస్థితి ఇలానే ఉంది. చాలా విషయాల్లో ఈ రెండు పార్టీ నేతల మాటల..
Andhra Pradesh: పైకి పోత్తు ఉందంటారు.. పనులు మాత్రం వేరువేరంటారు.. ఏపీలో ప్రస్తుతం జనసేన(Janasena), బీజేపీ(BJP) పరిస్థితి ఇలానే ఉంది. చాలా విషయాల్లో ఈ రెండు పార్టీ నేతల మాటల విషయాల్లో వైరుద్ధ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి..? జనసేన, కమల దళం ఏ విషయాల్లో వేరు దారుల్లో వెళ్తున్నాయి. ? ఇది ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..? పేరుకే పొత్తు..ప్రజా పోరాటాల విషయంలో మాత్రం ఎవరి జెండా వారే ఎత్తు.. అన్నట్టు ఉంది ఏపీలో జనసేన,బీజేపీ మధ్య రిలేషన్.అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా…ఉందని ఎవరికి వారు ఫీలవుతున్నారా అనే డౌట్ కలుగుతోంది. సేనాని పార్టీ ఓ మాటంటే, కమలదళం మరో మాట అంటోంది.రెండు పార్టీల మధ్య మాటల మధ్య వ్యత్యాసం కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాలు ఆధారాలను అందిస్తున్నాయి.
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ కు రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశాం కదా.. అని అంటున్నారు. ఇంతకీ రాబోయే ఎన్నికల విషయంలో జనసేనకు రోడ్ మ్యాప్ అందిందా ..? అందలేదా..? ఒకవేళ అందితే పవన్ కళ్యాణ్ మరో కొత్త రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నారా..? లేదా రోడ్ మ్యాప్ విషయంలో బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీసిందా..?
సాధారణంగా కేంద్ర పార్టీలు సముద్రం, నదులు ఫార్ములాను ఫాలో అవుతాయి.అంటే నదులు వచ్చి సముద్రంలో కలవాలి తప్పా, సముద్రం నదుల దగ్గరకు పోదు. దీని ప్రకారం కేంద్ర పార్టీల్లో ప్రాంతీయ పార్టీలు కలవాలి లేదా మాట వినాలి. అంతే తప్ప ప్రాంతీయ పార్టీలు ఆర్డరు వేయకూడదు. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా రోడ్ మ్యాప్ అంటూ బీజేపీకే పని చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు హార్ట్ అయ్యారా అనే అనుమానం కలుగుతోంది. అందుకే రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశామని చెబుతున్నారా అనే డౌట్ కూడా వస్తోంది.
పొత్తుని ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటి వరకు తలపెట్టిన భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం, రైతుల సమస్యలు, రోడ్లు దుస్థితి పై ఎవరికి వారు విడి విడిగా పోరాటాలు చేశారు. కాస్తో కూస్తో తిరుపతి ఉపఎన్నికలు, రథం దగ్దం, విగ్రహాల ధ్వంసంలో అడపా దడపా కలిశారు తప్ప ఇంకెక్కడా కలిసి పనిచేసింది లేదు. స్థానిక సంవస్తల ఎన్నికల విషయంలో వీరి గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించింది. బద్వేల్ ఉప ఎన్నిక పోటీ విషయంలో కూడా జనసేన వద్దని అంటే బీజేపీ మాత్రం పోటీ చేసింది. జనసేన పార్టీ సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది దానితో మాకు పనిలేదు మా సిద్ధాంతం కుటుంబ పాలనకు విరుద్ధం కాబట్టే ఎన్నికల్లో పోటీలో ఉన్నాము అని బీజేపీ ప్రకటించింది. తాజాగా కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో ఈ రెండు పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టు కనిపించాయి. ఎవరికి వారు సొంతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.పొత్తు ఉన్నప్పుడు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి కదా..? మరి ఎందుకు వేర్వేరుగా చేస్తున్నారే ప్రశ్న తలెత్తుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ అంటుంటే .. ఇక్కడేమో కనీసం నిరసన కార్యక్రమాలు కూడా కలిసి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
2014, 2019 ఎన్నికలను గమనిస్తే బీజేపీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏపీలోని ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంది. ప్రస్తుతం జనసేనకు బీజేపీ మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే ఈ మద్దతు మాటల వరకా లేక చేతల వరకో అర్థం కాని పరిస్థితి. వచ్చే 7,8,9 తేదీలలో ఉత్తరాంధ్ర లో చేపట్టనున్న పోజెక్టులపై జలపోరుయాత్ర లో కూడా జనసేనకు ఆహ్వానం లేదు. మరి పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు ప్రజా కార్యక్రమాల్లో మాత్రం పొత్తు ధర్మాన్ని ఎందుకు పాటించడం లేదో మాత్రం తెలయడం లేదంటున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలు రాబోయే రోజుల్లోనే బయటపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Reporter: vikram , Tv9 Telugu
Also Read: గంగమ్మకు హారతిచ్చిన బిగ్ బీ అమితాబ్