Cooking Tips: ఉప్పు లేకుండా వంట చేయాలను కుంటున్నారా.. అయితే ఈ పొడిని ట్రై చేయండి..రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం
Cooking Tips: షడ్రుచులలో ఒకటి ఉప్పు (Salt). భారతీయ వంటకాలలో(Indina Food) ఉప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్ధాలకు రుచిని ఇస్తుంది. అంతేకాదు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు తప్పనిసరిగా..
Cooking Tips: షడ్రుచులలో ఒకటి ఉప్పు (Salt). భారతీయ వంటకాలలో(Indina Food) ఉప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్ధాలకు రుచిని ఇస్తుంది. అంతేకాదు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు తప్పనిసరిగా కావాల్సిందే. అయితే ఉప్పుని ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకుంటున్నారు. వీటిల్లో ఎక్కువగా ఉండే రసాయనం వలన అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే కూరలను తయారు చేసుకునే తప్పుడు రుచి కోసం ఉప్పుని తప్పనిసరిగా వేయాల్సిందే. అయితే ఉప్పు తగ్గించుకుని.. కూరకు మరింత రుచినిచ్చే విధంగా కొన్ని రకాల పొడులను ఉపయోగిస్తే.. ఆ కూరకు అదనపు రుచి వస్తుంది. ఇంట్లో కూరల చేసుకునే సమయంలో పొడి చేసుకుని చేసుకుని ముందుగా రెడీ చేసుకుని ఉంటే.. ఏ కూరల్లో అయినా వేసుకోవచ్చు. దీంతో కూరకు గ్రేవీ, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఉప్పు తక్కువ తినేవారు కూరల్లో ఉప్పు మానేయవచ్చు.. అదే ఉప్పు ఎక్కువ మొత్తంలో ఉపయోగించేవారు తక్కువ వేసుకోవచ్చు. ఈరోజు సహజమైన టేస్టీ టేస్టీ కూరల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
వేరుశనగ పప్పు -1/2 kg పచ్చిశనగపప్పు -1/4 Kg నువ్వులు – 100 గ్రా. పొట్టు తీయని మినపప్పు 150 గ్రా. కరివేపాకు- ఒక కప్పు
తయారీ విధానం: ముందుగా కరివేపాకుని శుబ్రం చేసుకుని కడిగి అరబెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి.. స్విమ్ లో నూనె లేకుండా వేరుశనగప్పుపు వేసుకుని దోరగా వేపించుకోవాలి. అనంతరం పచ్చి శనగ పప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకుని.. అన్నిటిని చల్లారబెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సి గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ పొడిని గాజు సీసాలో తడి తగలకుండా భద్రపరచుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే బయట పెడితే.. 10, 15 రోజులు నిల్వ ఉంటుంది.
ఈ పొడిని కూరల్లో, ప్రైలలో ఉపయోగించవచ్చు. రుచికి రుచి.. గ్రేవీ వస్తుంది. అంతేకాదు ఉప్పు తక్కువ తినేవారికి కూడా అవసరం ఏర్పడదు. అదే ఉప్పు ఎక్కువగా ఉపయోగించేవారు నామమాత్రంగానే ఉపయోగించవచ్చు. మొత్తానికి వంటల్లో ఉప్పులేకుండా..ఈ పొడిని వాడుకోవచ్చు. ఉప్పు వాడకం తగ్గించడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉప్పులేకుండా మన జీవనశైలి ఉన్నప్పుడే.. ఆరోగ్యానికి మేలు అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.