AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Politics: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నట్లా? లేనట్లా? పాకిస్తాన్ రాజకీయ చరిత్ర మొత్తం డిఫరెంటే..!

Pakistan Politics: దాయాది దేశమైన పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం నానాటికీ ముదురుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏ క్షణం కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది.

Pakistan Politics: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నట్లా? లేనట్లా? పాకిస్తాన్ రాజకీయ చరిత్ర మొత్తం డిఫరెంటే..!
Imran Khan
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2022 | 8:23 PM

Share

Pakistan Politics: దాయాది దేశమైన పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం నానాటికీ ముదురుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏ క్షణం కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే, ఇమ్రాన్ మాత్రం తాు తగ్గేదే లేదంటూ భీష్మించుకుకూర్చున్నారు. ‘‘క్రికెటర్‌గా నేను ఎప్పుడూ చివరి బంత వరకు ఆడేందుకే ఇష్టపడ్డాను. ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకుంటున్నా.’’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి ఇమ్రాన్.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో సరిపడా బలం లేకపోయినప్పటికీ సైన్యం సపోర్ట్‌తో ఆయన ఇంతకాలం అధికారంలో కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు సైన్యం అండ లేకపోవడం, పరిస్థితులు దిగజారిపోతుండటంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ‘‘మాకు సమాచారం ఉంది. విదేశీ శక్తులు మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు.’’ అని ఇమ్రాన్ సంచలన ప్రకటన చేశారు. తాను కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఎందుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలో అమెరికా ముఖ్యమైన దేశం అని కూడా ప్రకటించేశాడు ఇమ్రాన్.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ రాజకీయ చరిత్ర మొత్తం అస్థిరమే. పాక్ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఎంతోమంది పదవీచ్యుతులయ్యారు. హత్య చేయబడ్డారు. రాజద్రోహం అభియోగాలు కూడా మోపబడ్డారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ సక్సెనా ప్రకారం.. పాకిస్తాన్, భారత్ మధ్య ఏడు దశాబద్ధాలుగా వైరం కొనసాగుతోంది. పాకిస్తాన్‌కు ఎంత మంది ప్రధానులు మారినా.. భారత్‌ను శత్రువుగానే పరిగణించారు తప్ప ఏ ఒక్కరూ మిత్ర దేశంగా భావించలేదు. సరైన సంబంధాలు కొనసాగించలేదు. పైగా.. భారతదేశంలో అలజడులు సృష్టించేందుకు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నారు. కశ్మీర్, పంజాబ్‌లలో పాక్ ప్రాయోజిత తిరుగుబాట్లు, కార్గిల్ యుద్ధం, పార్లమెంట్‌పై అటాక్స్, ముంబై దాడులు, ఉరీ, పుల్వామా, రాడికల్స్ పెరుగుదల వంటి ఇష్యూస్.. భారత్-పాకిస్తాన్‌ మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఇక 2019 లో జమ్మూ అండ్ కశ్మీర్‌ ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని నిబంధనలను భారత ప్రభుత్వ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ భారత్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత నెల మార్చి 27న ఇస్లామాబాద్‌లో ‘‘భారీ’’ ర్యాలీ పిలుపునిచ్చాడు. ఆ సమయంలో ఇమ్రాన్.. ఖురాన్‌లోని ఒక ప్రవచనాన్ని ప్రవరించాడు. ‘చెడుకు వ్యతిరేకంగా మంచితో నడవాలి.’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నించినందున తనను తొలగించేందుకు విదేశీ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.’ అని చెప్పుకొచ్చాడు. దానికి సంబంధి ఆధారాలంటూ ఒక లేఖను చూపించాడు. ఆ లేఖ ఇప్పుడు న్యాయ పరిశీలనలో ఉంది. ఆ లేఖలోని సమాచారం గోప్యంగా ఉంది.

ఇక ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమలర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ నదీమ్‌ అంజుమ్‌తో కలిసి ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని సందర్శించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రతిపాదిత ప్రసంగం ‘ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి దారి తీస్తుంది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది.’’ అని ప్రధానితో చర్చించారు. అలాంటి ప్రసంగాలు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ.. ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించాలని ఇమ్రాణ్ ఫిక్స్ అయ్యాడట. అందుకే చివరకు తన ప్రసంగం గురించి అన్ని వివరాలను గోప్యంగా ఉంచాడు ఇమ్రాన్ ఖాన్.

స్వాతంత్య్రం లేని ప్రజాస్వామ్య సంస్థలు.. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య సంస్థలు స్వంత ప్రాధాన్యతల వల్ల దెబ్బతింటున్నాయి. 2013లో అధికారంలోకి వచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ పేరు పనామా పత్రాల కేసులో వెల్లడైన నేపథ్యంలో 2017లో పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆయనను పదవి నుంచి తొలగించింది. 2018లో, పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ నవాజ్‌ను ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించకుండా అనర్హులుగా ప్రకటించింది. అకౌంటబిలిటీ కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాంతో నవాజ్ షరీఫ్ పదవి కాలం కూడా అసంపూర్తిగానే ముగిసిపోయింది. ఇక మెజారిటీ సంఖ్య అయిన 172 సభ్యుల మద్ధతు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సైన్యం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు.

ఇక సైన్యాధ్యక్షుడిగా దేశాన్ని ఏలిన పర్వేజ్ ముషారఫ్‌ 2007లో అత్యవసర పాలన విధించినందుకు గానూ పాకిస్తాన్ కోర్టు డిసెంబర్ 2019లో దేశద్రోహిగా ప్రకటించింది. సైనిక పాలన చరిత్ర కలిగిన పాకిస్తాన్‌లో ఇలాంటి తీర్పు రావడం అదే తొలిసారి. ఆ తీర్పుపై సైన్యం భగ్గుమంది. న్యాయ వ్యవస్థ గాడితప్పినట్లుగా కనిపిస్తోందంటూ సంచలన కామెంట్స్ చేసింది. కాగా, ముషారఫ్ 1999 తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2001 – 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా కొనసాగారు. జనరల్ ముషారఫ్ 2016లో పాకిస్తాన్‌ను విడిచి వెళ్ళాడు. అయితే, జనరల్ ముషారఫ్ 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేస్తూ.. తన పదవీకాలాన్ని పొడిగించడానికి ఉద్దేశించిన చర్యలో భాగంగా అత్యవసర పరిస్థితిని విధించాడు. ముషారఫ్ పాలన అంతమైన తరువాత న్యాయయస్థానం ముషారఫ్‌పై దేశద్రోహి ముద్ర వేసింది.

Also read:

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..

Farmer Innovation: రైతన్నకు హ్యాట్సాఫ్.. పోలీస్ సైరన్‌‌ను ఎలా వాడేశాడో చూడండి..!

AP Weather Alert: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు వార్నింగ్..!