Farmer Innovation: రైతన్నకు హ్యాట్సాఫ్.. పోలీస్ సైరన్‌ను ఎలా వాడేశాడో చూడండి..!
Farmer Innovation: పోలీస్ సైరన్ వింటే కామన్‌గా నేరస్తులకే కాదు సామాన్యులకు కూడా కాస్త వణుకు పుడుతుంది.. అలాంటి పోలీస్ సైరన్‌తో ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు.
Farmer Innovation: పోలీస్ సైరన్ వింటే కామన్‌గా నేరస్తులకే కాదు సామాన్యులకు కూడా కాస్త వణుకు పుడుతుంది.. అలాంటి పోలీస్ సైరన్‌తో ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు. తన పంటను కాపాడుకునేందుకు ఆ పోలీస్ సైరన్‌ను ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది.. తన ప్రయోగం ఫలించింది.. పంట సేఫ్ అయ్యింది. నిజంగా ఈ ఐడియా ఆ రైతుకు పెద్ద ఉపశమనం లభించినట్లయ్యింది.
పంటచెళ్ళలో అక్కడడక్కడా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం, ఎర్రటి రంగు చీరలను కట్టడం చేస్తుంటారు. వాటిని చూసి పక్షులు, జంతువులు బెదిరిపోతాయని రైతుల నమ్మకం. పోలీస్ సైరన్ వింటే కూడ అంతే ప్రయోజనం ఉంటుందని ఓ రైతు కనిపెట్టాడు. అదే పోలీస్ సైరన్ అక్కడి రైతులకు వరంగా మారింది. ఈ ఒక్క ఐడియాతో రైతులు తమ పంటను కాపాడుకుంటున్నారు.
సాధారణంగానే పంట పొలాలను జంతువులు, పక్షుల నుంచి రక్షించుకునేందుకు రైతులు పడే పాట్లు మాములుగా ఉండవు. ముఖ్యంగా కోతుల వలన పంటపొలాలు నాశనం అవుతున్నాయి. దీంతో పంటపొలాలను రక్షించుకునేందుకు రైతుల ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. కోతులతో పాటు! ఇతర జంతువులు పంటలను నాశనం చేసేస్తుంటాయి. 24 గంటలు పంటల వద్ద రైతులు ఉండలేరు కాబట్టి.. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు వచ్చిన ఉపాయమే ఈ సైరన్.
మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామానికి చెందిన రైతు వెంకన్న.. తనకున్న రెండు ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాడు. ఇప్పటికే నలభై వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. గత ఏడాది కోతుల వలన పూర్తిగా నష్టపోయిన ఈ రైతు, ఈ సారి కోతుల బెడద నుండి తప్పించుకునేందుకు ఉపాయాన్ని ఆలోచించాడు. ఇటీవల గ్రామంలో స్థానిక ఎస్సై సైరన్ తో పెట్రోలింగ్ చేస్తున్నపడు కోతుల పరుగెత్తడాన్ని గమనించాడు. తక్షణమే అలాంటి మైక్ ను కొనుగోలు చేసి పంట చేను వద్ద వినియోగిస్తున్నాడు. సైరన్ కూత వినబడగానే కోతులు పరారవుతున్నాయి. ఆ సౌండ్‌కు కోతులు ఉండకుండా పారిపోతాయని ఆ రైతు చేసిన ఉపాయం వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైతు ఉపాయం అదుర్స్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also read:
Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..
Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!