Hyderabad Metro: మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా

హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్స్ మరింత ఫాస్ట్‌గా ప్రయాణించనున్నాయి. అందుకు సంబంధించిన అనుమతలు లభించాయి.

Hyderabad Metro: మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా
Hyderabad Metro
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 02, 2022 | 5:04 PM

హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS‌ అనుమతి ఇచ్చింది. గంటకు 70 కి.మీ నుంచి 80 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు పచ్చ జెండా ఊపింది. మెట్రో రైళ్ల వేగం, భద్రతపై మార్చి 28,29,30న తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రో రైళ్ల వేగం పరిమిత పెంపుతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. నాగోల్‌-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు.. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు…. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది.

అందుబాటులోకి సూపర్ సేవర్ కార్డు…

హైదరాబాద్ మెట్రో.. తమ ప్రయాణీకుల కోసం సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది.  సూపర్ సేవర్ కార్డుతో  మెట్రో ప్రకటించిన సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు.  ఈ కార్డుతో జంట నగరాల్లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య ఒక రోజులో ఎన్నిసార్లైనా తిరగవచ్చు. ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారంతో పాటు ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగష్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్‌డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగ రోజుల్లో సూపర్​ సేవర్ కార్డుతో ప్రయాణించవచ్చు. కాగా  మెట్రో ప్రయాణికులు మొదటి సారి 50 రూపాయలతో కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. కార్డును రూ.59తో రీఛార్జీ చేసుకుంటే ఆఫర్ ప్రారంభమవుతుంది.

Also Read:Viral: సెల్యూట్.. ఒంటిపై ఉన్న చీరతో వందల మంది ప్రాణాలు కాపాడిన వృద్ధురాలు..