AP Weather Alert: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు వార్నింగ్..!

AP Weather Alert: తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి(గాలుల దిశ లో అకస్మాత్తుగా కలిగిన మార్పు) ప్రస్తుతం తెలంగాణ

AP Weather Alert: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు వార్నింగ్..!
Heatwaves
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 02, 2022 | 3:50 PM

AP Weather Alert: తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి(గాలుల దిశ లో అకస్మాత్తుగా కలిగిన మార్పు) ప్రస్తుతం తెలంగాణ నుండి రాయలసీమ మరియు కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 0 .9 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణం పొడిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ఎండలు పెరిగే అవకాశం ఉంది అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఐఎండీ అధికారుల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు అక్కడక్క కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజులు ఉష్ణో్గ్రతలు పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Also read:

Viral Video: షాకింగ్ స్టంట్స్‌తో అదరగొట్టిన పిల్లి.. ఏ మాస్టర్ కూడా పనికి రారంతే..!

Tata Sierra EV Range: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ వెళ్లొచ్చు..!

Summer Tips: వేసవిలో ఉదయం స్నానం మంచిదా? సాయంకాల స్నానం మంచిదా? కీలక విషయాలు మీకోసం..