AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: షాకింగ్ స్టంట్స్‌తో అదరగొట్టిన పిల్లి.. ఏ మాస్టర్ కూడా పనికి రారంతే..!

Viral Video: ఈ సమస్త జీవ కోటిలో మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులు ప్రధానంగా రెండే రెండు అని చెప్పుకోచవ్చు. అవి కుక్క, పిల్లి. ఈ రెండు జంతువులు దాదాపు

Viral Video: షాకింగ్ స్టంట్స్‌తో అదరగొట్టిన పిల్లి.. ఏ మాస్టర్ కూడా పనికి రారంతే..!
Cat Video
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2022 | 3:41 PM

Share

Viral Video: ఈ సమస్త జీవ కోటిలో మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులు ప్రధానంగా రెండే రెండు అని చెప్పుకోచవ్చు. అవి కుక్క, పిల్లి. ఈ రెండు జంతువులు దాదాపు ప్రతి ఇంట్లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లి, కుక్క.. మనుషుల్లో ఇట్టే కలిసిపోతాయి. కుక్కలను పెంచుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతారో.. పిల్లలను పెంచుకోవడానికి కూడా వారు అంతే ఆసక్తి చూపుతుంటారు. భారతదేశంలో పిల్లలు పెంచుకోవడాకి తక్కువ ఆసక్తి చూపుతారు కానీ.. పాశ్చాత్య దేశాల్లో పిల్లులను ఎక్కువగా పెంచుకుంటారు. ప్రపంచం వ్యాప్తంగా పిల్లులు సంఖ్య దాదాపు 500 మిలియన్లకు పైగానే ఉన్నట్లు ఒక అంచనా. అయితే.. పిల్లులు, పులులు ఒకే జాతికి చెందిన జీవులుగా పరిగణినంచడం జరిగింది. ఈ రెండూ వేటలో కొద్దిపాటి తేడాలతో ఒకే విధమైన నైపుణ్యం కలిగి ఉంటాయి. పులులు ప్రమాదకరమైన జంతువులు అయితే.. పిల్లులు మాత్రం సాదు జంతువులుగా మనుగడ సాగిస్తున్నాయి. పిల్లులకు సంబంధించి సోషల్ మీడియాలో రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించి షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో పిల్లి సరదాగా ఆడుకుంటోంది. యజమాని బొమ్మలను విసురుతుండగా.. అద్భుతమైన స్టంట్స్ వేస్తూ వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణగా పెంపుడు పిల్లులు నానా రచ్చ చేస్తాయి. యజమాని చెప్పినట్లు వింటాయి. చెప్పిన పని చేస్తాయి. ఈ వీడియోలో కూడా ఒకరు చిన్న టెడ్డీ బేర్‌ను విసిరారు. వెంటనే అలర్ట్ అయిన పిల్లి.. ఆ టెడ్డీ బేర్‌ను అద్భుత రీతిలో క్యాచ్ పట్టుకుంది. దానిని పట్టుకునేందుకు పిల్లి వేసిన స్టంట్ మామూలుగా లేదు. పిల్లి స్టంట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో mangesh.1337 పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ పిల్లి ఫీట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి స్టంట్స్ సినిమాల్లోనూ లేవంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఈ పిల్లి ఖచ్చితంగా నింజా’ అని కీర్తిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 18.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 2.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోన మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by Mangesh N (@mangesh.1337)

Also read:

Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..

Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!