Viral Video: పడుకున్న కుక్కను కదిపితే.. ఇలానే ఉంటుంది మరి.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు!
"ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు.. ఇప్పుడుకాకపోయినా ఎప్పటికైనా ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు" అని...
“ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు.. ఇప్పుడుకాకపోయినా ఎప్పటికైనా ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు” అని పెద్దలు ఊరికే చెప్పరు. మీరు కూడా ఈ వీడియో చూశాక, కచ్చితంగా ఈ సిద్ధాంతాన్ని నమ్మక మానరు. ఇక్కడ ఓ వ్యక్తి కుదురుగా కూర్చోకుండా వెళ్లి కుక్కలను కదిపాడు.. అంతే సీన్ కాస్తా సితారైంది.. బూమరాంగ్ మాదిరిగా కర్మ తిరిగి అతడి అంతు చూసింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సముద్రం ఒడ్డున సరదాగా సేద తీరకుండా.. వెళ్లి మరీ కుక్కలను కదిపాడు. మరి అవి ఊరుకుంటాయా.? అవన్నీ కలిపి అతడిపై ముప్పేట దాడికి వచ్చేశాయి.. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసేందుకు ఫన్నీగా ఉన్నా.. మంచి మెసేజ్ ఉంది బాసూ.. కర్మ అంటే ఇలానే ఉంటుందేమో. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ‘కర్మ అంటే ఇదే.. నువ్వు ఏం చేస్తే. అది కచ్చితంగా నీకు తిరిగి వస్తుందని’ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
Also Read:
Optical Illusion: ఈ ఫోటోలో మొదట చూసేదే మీ అతిపెద్ద బలం, బలహీనత.. అదేంటో తెలుసుకోండి!