Optical Illusion: ఈ ఫోటోలో మొదట చూసేదే మీ అతిపెద్ద బలం, బలహీనత.. అదేంటో తెలుసుకోండి!

ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సైకాలజీలో ఓ భాగమైన ఆప్టికల్ ఇల్యూషన్..

Optical Illusion: ఈ ఫోటోలో మొదట చూసేదే మీ అతిపెద్ద బలం, బలహీనత.. అదేంటో తెలుసుకోండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 02, 2022 | 1:24 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సైకాలజీలో ఓ భాగమైన ఆప్టికల్ ఇల్యూషన్.. మనలోని వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. ఒక ఫోటోను ప్రతీ ఒక్కరూ ఒకేలా చూడరు. చాలామంది చాలా కోణాల్లో చూస్తారు. ఇక ఆ అంశాలే మన ప్రవర్తనను, స్వభావాన్ని వ్యక్తపరుస్తాయి. పజిల్స్ మనలోని చురుకుదనాన్ని పెంపొందిస్తే.. ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు మనలోని మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు కోకొల్లలు. వాటిల్లో కనిపించేది ఏంటి.? ముందుగా మనం ఏం చూస్తామన్నది మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ అందమైన దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇది ఓ వ్యక్తి సైకాలజీని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మీరు దేనినైతే మొదట చూస్తారో.. అది మీ అతిపెద్ద బలాన్ని, బలహీనతను చెబుతుంది. ఒకసారి మీరూ ప్రయత్నించండి.

మనిషి ముఖం (సాల్వడార్ డాలీ)

అతి పెద్ద బలం: మీరు మొదటిగా మనిషి ముఖాన్ని చూసినట్లయితే.. అత్యంత క్షమించలేని పరిస్థితులు ఎదురైనా కూడా మీరు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని సూచిస్తోంది. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా మీరు దృఢంగా.. పట్టు కోల్పోకుండా ఉంటారు. ఇది మీ స్నేహితులకు కూడా తెలుసు.

అతిపెద్ద బలహీనత: మీరు ఎలప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు మీ జీవితం సాఫీగా ఉండేందుకు కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కష్టమైన ఎమోషన్స్‌ నుంచి కూడా మీరు ఈజీగా తప్పించుకుంటారు. ఇదే మీ అతిపెద్ద బలహీనత. దీని వల్ల మీరు మీ స్నేహితులకు, ఫ్యామిలీ‌కి దూరం కావచ్చు.

మహిళ:

అతిపెద్ద బలం: ఈ చిత్రంలో మీరు ముందుగా మహిళను గమనించినట్లైతే.. మీరు సహజంగా తెలివైన వ్యక్తి అని అర్థం, మీరు ప్రతీ విషయాన్ని లోతుగా అన్వేషిస్తారు.

అతి పెద్ద బలహీనత: మీరు కొన్ని విషయాల్లో చాలా ఎమోషనల్‌గా ఉంటారు. తగిన శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేని వాటిపై ఉద్రేకం కావొద్దు.

టేబుల్:

అతిపెద్ద బలం: మీరు ముందుగా టేబుల్‌ని చూసినట్లయితే.. మీ అతిపెద్ద బలం.. ఏ విషయాన్ని అయినా కూల్‌గా వినడం, ఇతరుల నుంచి సానుభూతి పొందటం కావచ్చు. “మీరు కమ్యూనికేట్ చేయడంలో తెలివైనవారు, అలాగే కఠినమైన సమయాన్ని ఎదుర్కుంటున్న వ్యక్తులు కూడా మీతో వారి భావాలను పంచుకుంటారు.

అతిపెద్ద బలహీనత: “కమ్యూనికేషన్ మీ అతిపెద్ద బలం అయితే.. ప్లాన్‌ను సరిగ్గా అమలు చేయలేకపోవడం మీ అతిపెద్ద వీక్‌నెస్”. ఇతరుల బాధలను తెలుసుకుని వారికి సహాయం చేయాలని అనుకుంటారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఒక నిర్దిష్ట ఆలోచనను అమలు చేయడంలో మీకు చాలా కష్టం.

గమనిక: పైన పేర్కొన్న ఆప్టికల్ ఇల్యూషన్.. ఆర్కిటెక్ట్, పెయింటర్ ఒలేగ్ షుప్ల్యాక్ 2011లో ‘ది గర్ల్ రీడింగ్ సాల్వడార్ డాలీ’ అనే పెయింటింగ్‌ లోనిది.

Also Read: Protein Foods: మగాళ్లూ జాగ్రత్త.. నాన్-వెజ్ బాగా లాగిస్తున్నారా.? అయితే ఆ సామర్ధ్యం తగ్గుతున్నట్లే.!