Pushpa Song: సామీ సామీ సాంగ్‌కు యుఎస్ అమ్మాయిలు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్
Pushpa Song: పుష్ప సినిమా ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్(Bollywood)లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప మువీలోని సాంగ్స్ , మేనరిజంకు సామాన్యుల నుంచి సెలబ్రెటీలు..
Pushpa Song: పుష్ప సినిమా ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్(Bollywood)లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప మువీలోని సాంగ్స్ , మేనరిజంకు సామాన్యుల నుంచి సెలబ్రెటీలు కూడా ఫిదా.. సామి సామి సాంగ్, చూపే బంగారమాయెనా శ్రీ వల్లి(Sri Valli) సాంగ్స్ తో పాటు తగ్గేదేలే వంటి రీల్స్ తో దేశవిదేశాల్లోని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా సామీ సామీ పాట రీల్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. మౌనిక యాదవ్ పాడిన ఈ పాటకు ఇద్దరు అమ్మాయిలు భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించి ఓ రేంజ్ లో హుక్ స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
2021లో పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ రిలీజైంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నల సామీసామీ సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు ఓ ఇద్దరు అమ్మాయిలు హుక్ స్టెప్స్ వేస్తూ ఉన్న వీడియో అలరిస్తోంది. ఈ యువతులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ప్రవాసభారతీయులుగా తెలుస్తోంది. పిట్స్‌బర్గ్, మిన్నియాపాలిస్‌లో ఉంటున్న రాధాప్రియాంక, రాజు గారి అమ్మాయి అనే ఇద్దరు అమ్మాయిలు సామీ సామీ సాంగ్ కు చక్కగా డ్యాన్స్ చేశారు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో “సామీ అబ్సెషన్” అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో మార్చి 23న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. అప్పటి నుండి, ఈ అమ్మాయిల డ్యాన్స్ ను నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు 7.3 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
View this post on Instagram