- Telugu News Photo Gallery Summer Tips Know When is best time to bath and why evening bath is good for health check here all details
Summer Tips: వేసవిలో ఉదయం స్నానం మంచిదా? సాయంకాల స్నానం మంచిదా? కీలక విషయాలు మీకోసం..
Summer Tips: వేసవి కాలం వచ్చేసింది. వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఈత కొట్టడానికి ఆసక్తి చూపుతారు. పట్టణాల్లో అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే బావులు, చెరువులు, కాలువల్లో ఈత కొట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇక స్నానం విషయానికి వస్తే కొందరు ఉదయం చేస్తే.. మరికొందరు సాయంత్రం చేస్తారు. ఇంకొందరు ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తుంటారు. అయితే, కొందరిలొ ఒక సందేహం ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేస్తే మంచిది అనే ప్రశ్న తలెత్తుంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో ఉదయం స్నానం చేయడం మంచిదా? సాయంత్రం స్నానం చేయడం మంచిదా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 02, 2022 | 6:20 AM

అనేక అద్యయనాల నివేదికల ప్రకారం.. వేసవి కాలంలో సాయంకాలం స్నానం చేయడం ఉత్తమం. రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మానికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, రెండు పూటల చేయడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు అని చెబుతున్నారు.

వేసవి కాలంలో ఎక్కువ సేపు బయట ఉండడం వల్ల చెమట పట్టం దుమ్ము, దూళి చర్మంపై పేరుకుపోతుంది. అలా రోగాల బారిన ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సాయంత్రం పూట స్నానం చేయడం మంచిది. పడుకునే ముందు స్నానం చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగానూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం మంచి అలవాట్లలో ఒకటిగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు, గాఢ నిద్ర కూడా వస్తుంది. ఒత్తిడి దూరం అవుతుంది. మనస్సు, చర్మం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే రాత్రిపూట స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అని పేర్కొంటున్నారు నిపుణులు.

అలా అని ఉదయం స్నానం చేయడం వల్ల నష్టమేమీ లేదు. పొద్దున్నే స్నానం చేసి బయటకు వెళితే.. బయట దుమ్ము, దూళి, కాలుష్య కారకాలు అన్నీ మన శరీరంపై పేరుకుపోతాయి. అలాంటిప్పుడు రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.