Viral Video: వారెవ్వా..! వయసు ఎనిమిదేళ్లే.. సంపాదన మాత్రం వందల కోట్లు..! ఎలానో తెలుసా..?

Viral Video: వారెవ్వా..! వయసు ఎనిమిదేళ్లే.. సంపాదన మాత్రం వందల కోట్లు..! ఎలానో తెలుసా..?

Anil kumar poka

|

Updated on: Apr 02, 2022 | 9:42 AM

సాధారణంగా 8 ఏళ్ల వయసులో పిల్లలేం చేస్తుంటారు? స్కూలుకెళ్లి చదువుకుంటారు.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తారు. అమ్మానాన్నల వద్ద మారాం చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన ఈ ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రం కోట్లు సంపాదిస్తూ రికార్డులు తిరగరాస్తుంది. అవును, వరుసగా కొన్నేళ్ల నుంచి అత్యధిక వార్షికాదాయం


సాధారణంగా 8 ఏళ్ల వయసులో పిల్లలేం చేస్తుంటారు? స్కూలుకెళ్లి చదువుకుంటారు.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తారు. అమ్మానాన్నల వద్ద మారాం చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన ఈ ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రం కోట్లు సంపాదిస్తూ రికార్డులు తిరగరాస్తుంది. అవును, వరుసగా కొన్నేళ్ల నుంచి అత్యధిక వార్షికాదాయం పొందుతున్న చిన్నారి యూట్యూబర్ గా ఆమె రికార్డులకెక్కింది. ఈ చిన్నారి తన యూట్యూబ్ చానెళ్ల ద్వారా 2021లో అత్యధిక ఆదాయం పొందిన చిన్నారిగా రికార్డు సృష్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 చానెళ్లను ఆమె ఏకధాటిగా నిర్వహిస్తోంది.వాటిలో ముఖ్యమైనది ‘లైక్ నాస్త్య’అనే ఛానెల్‌. ఈ చానెల్ కు 8.6 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. మొత్తంగా ఆమె యూట్యూబ్ చానెళ్లకు 26 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లున్నారు.
ఇంత టాలెంట్‌ ఉన్న ఈ చిన్నారి విషయంలో విచారించదగ్గ విషయం ఏంటంటే… ఈమె చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీ అనే జబ్బుతో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల ఎప్పటికీ ఆమె మాట్లాడే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. చిన్నారిని ఎలాగైనా మాట్లాడించాలనే తపనతో 2015లో వారు ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించి.. చిన్నారితో మాట్లాడించే ప్రయత్నం చేశారట. అలా కొద్దిరోజుల్లోనే అనస్తాసియా మాట్లాడం నేర్చుకుందట. ఆ తర్వాతి ఏడాదే మరో చానెల్ ను పెట్టి మరింత ప్రోత్సహించారట. చిన్నచిన్నగా బొమ్మల రివ్యూను ఇవ్వడం ప్రారంభించారట. అలా అలా ఆమె సంపాదన మొదలుపెట్టింది. ఆమె అనారోగ్యమే ఆమెపట్ల వరంగా.. ఆదాయ వనరుగా మారింది. ఇప్పుడు అత్యధిక సంపాదన పొందిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది. అందుకే “ఏమి జరిగినా మన మంచికే’ అని పెద్దలు చెప్పే మాటలు వృథాపోవు. చేసే ప్రయత్నమూ వృథాపోదు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..