Dry Fruits: ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే

అసలే కరోనా కాలం. దీంతో డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇపుడీ డిమాండ్‌కి ఆఫ్గన్ క్రైసిస్‌ కూడా తోడైంది. దీంతో ఒక్కో ఐటెం...

Dry Fruits: ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే
Dry Fruits
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2021 | 3:01 PM

అసలే కరోనా కాలం. దీంతో డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇపుడీ డిమాండ్‌కి ఆఫ్గన్ క్రైసిస్‌ కూడా తోడైంది. దీంతో ఒక్కో ఐటెం మీద రెండు నుంచి మూడు వందల రూపాయల మేరా పెరిగింది.  అంజీర్, కిస్ మిస్, బాదం, పిస్తా, వాల్ నట్స్, ఆప్రికాట్, కుంకుమపువ్వు వంటి వాటికి భారత మార్కెట్లో విపరీతమైన డిమాండుంది. ఆఫ్గనిస్థాన్‌ను తాలిబాన్లు ఆక్రమించడంతో.. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా సీజన్‌లో ఇమ్యూనిటీ కోసం డాక్టర్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటారు. ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం. అందునా ఆఫ్గన్ నుంచి దిగుమతయ్యే వీటి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. అందుకే అందరూ ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఆఫ్గాన్‌లో ఒకరకమైన ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. దీంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ప్రస్తుతం.. కిలో అంజీర్ 1280, బాదం 1290, వాల్ నట్స్ 1300 రూపాయలు పలుకుతున్నాయ్. అదే వారం క్రితం 700 నుంచి 800 రూపాయలు మాత్రమే ఉండేవి. ఇపుడున్న ఆఫ్గనిస్థాన్ స్థితి గతుల దృష్ట్యా.. అన్ని డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ భాగం.. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటిలో ఎండు ద్రాక్ష, కిస్ మిస్, వాల్ నట్స్, బాదం, పైన్ నట్, పిస్తా, అప్రికాట్, అంజీర్, కుంకుమపువ్వు వంటివి దాదాపు ఆఫ్ఘనిస్థాన్ నుంచే ఎక్కువగా.. దిగుమతి చేసుకుంటాం. కానీ ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతుల నడుమ.. వీటి వాడకం మీద ధరల ప్రభావం అధికంగా పడ్డంతో.. మరింత ప్రియమవుతున్నాయి.

మరీ ముఖ్యంగా గత వారం నుంచీ ధరలు పెరిగిపోవడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. వీరితో పాటు మార్కెట్ వర్గాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత ఆరోగ్య వ్యవస్థ మీదే కాదు,  ఆర్ధిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు అనలిస్టులు.  ప్రస్తుతం నడుస్తోన్నది ఆఫ్గనిస్థాన్ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. అక్కడి స్థితిగతులు మన దేశ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. అసలు మ్యాటర్ తెలిసి అవాక్కయిన పోలీసులు..