Mount Everest : ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు..! ‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కారణం ఏమిటి?
Mount Everest : ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎక్కడానికి ప్రజలు ఎందుకు అంత కష్టపడుతున్నారు.. విమానంలో వెళ్లి సులభంగా
Mount Everest : ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎక్కడానికి ప్రజలు ఎందుకు అంత కష్టపడుతున్నారు.. విమానంలో వెళ్లి సులభంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవచ్చు కదా అని అందరు అనుకుంటారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తప్ప ఈ రోజు వరకు ఎవరూ ఈ సాహసం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రదేశం అంత ప్రమాదకరమైనది.14 మే 2005 న, ఫ్రెంచ్ టెస్ట్ హెలికాప్టర్ పైలట్ డిడియర్ డెల్సాలా ఎవరెస్ట్ పై దిగాడు. ఆ తరువాత ఈ రోజు వరకు ఈ పని చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే అతడు కఠోర శిక్షణ తీసుకుని, ఆ ప్రదేశం గురించి రీసెర్చ్ చేయడం వల్ల అది సాధ్యమైంది.
పరిణామాలు భయంకరమైనవి ప్రపంచంలోని ఎత్తైన శిఖరానికి విమానం ప్రయాణించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎవరెస్ట్ శిఖరం పై తుఫాను గాలులు ఎల్లప్పుడూ వీస్తూ ఉంటాయి. గాలి, ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతను ఆవిరి చేస్తాయి. ఎవరెస్ట్ పర్వతం ఉష్ణోగ్రత సున్నా కంటే చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఒక విమానం లేదా పైలట్ ఎలా బయటపడతారు? ప్రపంచంలో కమర్షియల్ జెట్‌లు నడిపే పెద్ద పెద్ద పైలెట్లు కూడా ఎవరెస్ట్ పై తీసుకెళ్లడానికి సాహసించరు. ఇంత ఎత్తైన అత్యంత ప్రమాదకరమైన శిఖరాలకు విమానం ఎగరడం వల్ల కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ఈ పైలట్లకు తెలుసు.
టిమ్ మోర్గాన్ అనే వాణిజ్య పైలట్ ఇలా చెప్పాడు. ఏ విమానం అయినా 40,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. దీని ప్రకారం ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 29,031.69 అడుగులు. అటువంటి పరిస్థితిలో విమానాలు ఎవరెస్ట్ శిఖరం వరకు సులభంగా ఎగురుతాయి. కానీ ఎవరెస్ట్ వద్దకు వెళ్లే విమాన మార్గం చాలా ప్రమాదకరమైనది. వాతావరణం చాలా వేగంగా మారుతుంది. చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ విమానంలో ప్రయాణించడం సాధ్యం అనిపించదు. విమానంలో 20 నిమిషాల ఆక్సిజన్ ఉంటుంది. విమానం క్యాబిన్ పీడనం తగ్గితే అప్పుడు విమానం ఎత్తుకు పెంచవలసి ఉంటుంది. ఇక్కడ శ్వాసక్రియకు ఆక్సిజన్ దొరుకుతుంది. దీనిని డ్రిఫ్ట్ డౌన్ విధానం అంటారు. సమీపంలోని పర్వతం పైన విమానం కూలిపోయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.