Tokyo Olympics 2020 Highlights: మ్యాచ్ గెలిచారు.. కానీ క్వార్టర్స్‌కు క్వాలిఫై కాలేకపోయారు..

Venkata Chari

Venkata Chari | Edited By: Ravi Kiran

Updated on: Jul 27, 2021 | 6:17 PM

Tokyo Olympic 2020 Live: ఈ రోజు టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాల సంఖ్య పెరగాలని, అలాగే అథ్లెట్లు అన్ని క్రీడలలోనూ బాగా రాణించాలని కోరుకుంటోంది.

Tokyo Olympics 2020 Highlights: మ్యాచ్ గెలిచారు.. కానీ క్వార్టర్స్‌కు క్వాలిఫై కాలేకపోయారు..
Olympics

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి నిరాశ ఎడురైంది. భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి జోడీ మంగ‌ళ‌వారం జ‌రిగిన గ్రూప్ ఎ పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో విజ‌యం సాధించినా.. క్వార్టర్స్‌కు క్వాలిఫై కాలేకపోయారు. గ్రూప్ మ్యాచ్‌లో బ్రిట‌న్‌కు చెందిన బెన్ లేన్‌, సీన్ వెండీల‌పై 21-17, 21-19 తేడాతో గెలుపొందిన సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి జోడీ… గ్రూప్‌ దశలో మ‌రో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్టర్స్‌కు మాత్రం క్వాలిఫై కాలేక‌పోయారు.

మరోవైపు చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్‌, వాంగ్ చిలిన్ జోడీ ప్రపంచ నంబ‌ర్ వ‌న్‌ ఇండోనేషియా జోడీ మార్క‌స్ గిడియోన్‌, కెవిన్ సుక‌ముల్జో జోడీపై గెలవడంతో సాత్విక్‌, చిరాగ్ జోడీ క్వార్టర్స్ అవకాశాలను దెబ్బతీసింది. కాగా, సోమ‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో మార్క‌స్ గిడియోన్‌, కెవిన్ సుక‌ముల్జో జోడీ 21-13, 21-12 తేడాతో సాత్విక్‌, చిరాగ్‌ల జోడీపై గెలుపొందిన విష‌యం తెలిసిందే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jul 2021 06:12 PM (IST)

    మ్యాచ్‌లో గెలిచారు.. అయినా ఇంటిదారి పట్టారు..

    భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ షెట్టి జోడీ మంగ‌ళ‌వారం జ‌రిగిన గ్రూప్ ఎ పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో విజ‌యం సాధించారు. బ్రిట‌న్‌కు చెందిన బెన్ లేన్‌, సీన్ వెండీల‌పై 21-17, 21-19 తేడాతో గెలుపొందారు. అయితే గ్రూప్‌ దశలో మ‌రో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్టర్స్‌కు మాత్రం క్వాలిఫై కాలేక‌పోయారు.

  • 27 Jul 2021 11:53 AM (IST)

    బాక్సింగ్: క్వార్టర్ ఫైనల్ చేరిన లోవ్లినా

    టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 69 కిలోల విభాగంలో లోవ్లినా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన అపెట్జ్ నెడిన్‌ను 3-2 తేడాతో ఓడించి.. తదుపరి రౌండ్‌కు చేరుకుంది.

  • 27 Jul 2021 11:08 AM (IST)

    బ్యాడ్మింటన్: క్వార్టర్ ఫైనల్‌కు దూరమైన సాత్విక్-చిరాగ్

    పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌ సైరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట 21-17, 21-19తో బ్రిటన్ బెన్ లేన్, సీన్ వెండిలను ఓడించింది. కానీ, ఈ జంట క్వార్టర్ ఫైనల్స్‌ను చేరుకోవడంలో మాత్రం విఫలమైంది.

  • 27 Jul 2021 10:20 AM (IST)

    బ్యాడ్మింటన్: మొదటి గేమ్‌లో సాత్విక్-చిరాగ్ విజయం

    పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో బ్రిటన్‌కు చెందిన బెన్ లేన్, సీన్ వెండి జోడీతో భారత జోడీ సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టి పోటీ పడుతోన్నారు. 21-17తో తొలి సెట్‌ను గెలుచుకుని, దూకుడు ప్రదర్శించారు. ఈ ఆట కేవలం 18 నిమిషాల్లో పూర్తయింది.

  • 27 Jul 2021 08:26 AM (IST)

    షూటింగ్ - పతక ఆశలకు గండి

    షూటింగ్‌లో పతకం ఆశలకు గండి పడింది.  10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ జోడీ మను బాకర్, సౌరభ్ చౌదరి టాప్ -4 లో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ జంట రెండో రౌండ్‌లో మొత్తం 380 పరుగులతో ఏడవ స్థానంలో నిలిచి టాప్ -4 స్థానానికి దూరమైంది.

  • 27 Jul 2021 08:18 AM (IST)

    హాకీ: 3-0తో భారత్ విజయం

    ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో భారత్ 3-0తో స్పెయిన్‌ను ఓడించింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో 7-1 తేడాతో ఓడిపోయిన భారత్.. ఈ రోజు జరిగిన మ్యాచుల్ తిరిగి పుంజుకుంది. భారత్ తరపున రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేయగా, సిమ్రాంజిత్ ఒక గోల్ చేశాడు. ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు వచ్చినప్పటికీ స్పెయిన్ వాటిని గోల్‌గా మార్చలేకపోయింది.

  • 27 Jul 2021 07:21 AM (IST)

    హాకీ:  2-0 ఆధిక్యంలో భారత్

    స్పెయిన్‌పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి స్పెల్‌లో రెండు గోల్స్ చేసిన భారత్, రెండవ స్పెల్‌లో కొంచెం డిఫెన్స్ గేమ్ ఆడుతోంది.  స్పెయిన్ కూడా ఎదురుదాడికి దిగినా.. భారత్ బాగానే ఎదుర్కొంది.  స్పెయిన్ రెండు పెనాల్టీ కార్నర్స్‌ లభించినా..  భారత్ ధీటుగా ఎదుర్కొంది.

  • 27 Jul 2021 06:55 AM (IST)

    హాకీ: భారత పురుషుల హాకీ మ్యాచ్ ప్రారంభం

    భారత్, స్పెయిన్ పురుషుల హాకీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గత మ్యాచ్‌లో భారత్ పేలవమైన ప్రదర్శన కారణంగా ఓడిపోయింది.  ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. లేకుంటే ఒలింపిక్స్‌ నుంచి ఇంటిబాట పట్టనుంది.

  • 27 Jul 2021 06:14 AM (IST)

    షూటింగ్: రెండవ రౌండ్‌కు చేరుకున్న మను-సౌరభ్ జోడీ

    మూడవ సిరీస్‌లో మను-సౌరభ్ జోడీ 193 పరుగులు చేసింది. మను 95, సౌరభ్ 98 పాయింట్లు సాధించారు. వారిద్దరి మొత్తం స్కోరు 582. ఇద్దరూ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఈ జంట మొదటి రౌండ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ రౌండ్‌లో సౌరభ్ అద్భుతంగా రాణించాడు. రెండవ సిరీస్‌లో 10-10 లక్ష్యాలను సాధించాడు.

Published On - Jul 27,2021 6:12 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu