Fishing : సుందిళ్ళ బ్యారేజి దగ్గర చేపల కోసం పోటెత్తిన జనం.. కనువిందు చేస్తోన్న మత్స్య సంపద
మంచిర్యాల జిల్లా సుందిళ్ళ బ్యారేజి దగ్గర ఈ ఉదయాన్నుంచీ చేపల కోసం జనం పోటెత్తారు. వరద గేట్లను మూసేయడంతో చుట్టుపక్కల..
Sundilla Barrage – Fish Hunting : మంచిర్యాల జిల్లా సుందిళ్ళ బ్యారేజి దగ్గర ఈ ఉదయాన్నుంచి చేపల కోసం జనం పోటెత్తారు. వరద గేట్లను మూసేయడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందల మంది చేపల కోసం బ్యారేజికి చేరుకుంటున్నారు. బ్యారేజి గేట్ల కింద నీటి గుంతల్లో ఉన్న చేపలను పట్టుకుంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు బ్యారేజీ భారీగా వరద వచ్చింది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద తగ్గిన తర్వాత మూసేశారు. ఈ క్రమంలో గేట్ల కింద వరదలో కొట్టుకొచ్చిన టన్నుల కొద్దీ చేపల కోసం జనం ఎగబడుతున్నారు.
బ్యారేజీ దగ్గరకి తెల్లవారుజాము నుంచి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలి వస్తున్నారు. అయితే, చేపల కోసం నీటి గుంతల్లో దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని అధికారులు సూచిస్తున్నారు.