Anantapur politics : తాడిపత్రిలో పెద్దారెడ్డి – జేసీ మధ్య మళ్లీ బస్తీ మే సవాల్ పాలిటిక్స్.. ఈ ఉదయం జేసీ ధర్నా

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Jul 27, 2021 | 10:12 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్‌ ఫైట్‌ అగ్గి రాజేస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య సాగుతున్న వివాదం నేపథ్యంలో..

Anantapur politics : తాడిపత్రిలో పెద్దారెడ్డి - జేసీ మధ్య మళ్లీ బస్తీ మే సవాల్ పాలిటిక్స్.. ఈ ఉదయం జేసీ ధర్నా
Follow us

Peddireddy Vs JC : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్‌ ఫైట్‌ అగ్గి రాజేస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య సాగుతున్న వివాదం నేపథ్యంలో ఇవాళ జేసీ ధర్నాకు సిద్దమయ్యారు. తహశీల్దార్‌ ఆఫీసు ఎదుట ఆయన నిరసన చేపట్టనున్నారు. సీపీఐ కాలనీలో కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నట్టు ప్రభాకర్‌ ప్రకటించారు.

కొద్దిరోజులు గ్యాప్‌ ఇచ్చినా.. ఆల్‌ టైం ఎనిమీస్‌గా ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్‌ షురూ అయింది. తాడిపత్రిలో అక్రమ కట్టడాల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాత్ర ఉందన్నది జేసీ ప్రభాకర్‌ ఆరోపణ. ఈ ఇష్యూపై ఇద్దరి మధ్య మాటకు మాట కూడా కొనసాగింది.

కట్ చేస్తే, జేసీ ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ అయ్యిండారు కదా.. ఏదో ఒక సీటు ఎక్స్‌ట్రాతో చైర్మన్ గిరి వచ్చిందిగా.. కానీ రాష్ట్రమంతా టీడీపీ ఓడిపోతే.. తానున్నచోట గెలవడం పెద్దారెడ్డికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే జేసీ చైర్మన్‌ కుర్చీ లాగేసుకునేందుకు కౌన్సిలర్‌ను పట్టేపనిలో పడ్డారట కేతిరెడ్డి సాబ్. అదే.. సీపీఐ కౌన్సిలర్‌ను డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా బెదరకొట్టాలన్న స్కెచ్చట. ఆస్కెచ్‌లో భాగంగా సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని..అధికారులు నోటీసులిచ్చారు.

ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా ఇచ్చారట. ఈ అక్రమ ఇళ్ల లిస్టులో జేసీకి సపోర్ట్ చేసిన ఓ సీపీఐ కౌన్సిలర్‌ కూడా ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న జేసీకి కాలింది. హలో బ్రదర్ రాసిపెట్టుకో.. ఇంకా నాపదవి 3ఏళ్లు పైనే ఉంది.. దమ్ముంటే దించు..చూస్తా అంటూ సవాల్ విసిరినారు జేసీ బ్రో. జేసీ బ్రో మాట.. పెద్దారెడ్డి తూట అన్నట్టుగా డైలాగులైతే పడుతున్నాయ్. దీంతో ఓవరాల్‌గా తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ వెదర్ క్రియేట్ అయినట్లు కనిపిస్తోంది.

నా కౌన్సిలర్లను లాగినన్ను పదవి నుంచి దింపే ప్రయత్నం జరుగుతోందని జేసీ ఆరోపణ. ఆంత సీను లేదన్నది పెద్దారెడ్డి వివరణ. అయినా ఈ గొడవ ఇంతటితో ఆగేదిలా కనిపించడం లేదు. మంగళవారం జేసీ కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయబోతుండటంతో ఈ ధర్నాలో ఎలాంటి గొడవ జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు తాడిపత్రి జనాలు. జనవరిలో జరిగింది గుర్తు చేసుకుంటూ భయం గుప్పిట్లో నలుగుతోంది తాడిపత్రి.

Read also : Tungabhadra : మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో తుంగభద్రలో నీటి ప్రవాహం.. శ్రీశైలం డ్యాం తెరిచేది ఎప్పుడంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu