Dalita Bandhu : హుజురాబాద్ ఉప ఎన్నికలో మిస్సైల్‌లా మారిన ‘దళిత బంధు’
దళితబంధు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక యుద్ధ మిస్సైల్‌లా మారింది. ఈ వినూత్న పథకం హుజురాబాద్ ఉప ఎన్నికలో కీలకం అయ్యేలా కనిపిస్తోంది...
Huzurabad by-election : ‘దళితబంధు’ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక యుద్ధ మిస్సైల్‌లా మారింది. ఈ వినూత్న పథకం హుజురాబాద్ ఉప ఎన్నికలో కీలకం అయ్యేలా కనిపిస్తోంది. పథకం యావత్తు తెలంగాణపై ఆధారపడి ఉంటుందన్న సీఎం కేసీఆర్ మాటలు.. స్కీంపై ఆయనకున్న నమ్మకానికి అద్దం పడుతోంది. దీనికితోడు టీఆర్‌ఎస్‌లోకి నేతల వలసలతో.. ఎవరికి హుజురాబాద్ టికెట్ దక్కుతుంది. దళితబంధు పథకం ఏ నేతకు దోహదం చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్. రమణ కారెక్కగా.. తాజాగా బీజేపీ నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మొదలైన ఆపరేషన్ హుజురాబాద్.. తాజా రాజకీయాలను హీటెక్కించేలా చేస్తోంది. దళితబంధు కేవలం కార్యక్రమం కాదని, ఉద్యమంగా సీఎం కేసీఆర్ అభివర్ణించడాన్ని చూస్తే పథకం లక్ష్యం.. కచ్చితంగా హుజురాబాద్ ఎన్నికపై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు దళిత నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం కేంద్రం కూడా అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధు ఉపయోగపడుతుందని ఇంకొందరు చెబుతున్నారు.
దళితబంధు దేశంలోనే విప్లవాత్మక మార్పుకు దారితీస్తుందని ఎమ్మెల్యే గోరేటి వెంకన్న అన్న మాటలు ఈ పథకానికి మరింత హైప్ తీసుకొచ్చాయి. తెలంగాణ దళిత సమాజం వ్యాపారవర్గంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు గోరేటి. ఒకప్పుడు కొద్దిపాటి మొత్తాన్ని లోన్ తీసుకునేందుకు ఎంతో కష్టపడిన దళితులు, నేడు దళిత బంధు పథకంలో రూ.10 లక్షలు పొందనుండడం కేసీఆర్ మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు.
Read also : Visakha : నేడే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక