AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha : నేడే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక జరిగనుంది...

Visakha : నేడే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక
Visakha
Venkata Narayana
|

Updated on: Jul 27, 2021 | 6:50 AM

Share

GVMC standing committee polls : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక జరిగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం బరిలోకి దిగింది. స్టాండింగ్ కమిటీకి నగర మేయర్ చైర్ పర్సన్ గా కొనసాగుతారు. కాగా పది మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ నెల 23 తోనే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది.

పది మంది డైరెక్టర్ల గాను అధికార వైసీపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి పదిమంది కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. మొత్తం 98 వార్డులకుగాను.. వైసిపికి 58 మంది, టిడిపి 30 మంది, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా నలుగురు, బిజెపి నుంచి ఒకరు కార్పొరేటర్లు గెలుపొందారు. కాగా టిడిపి నుంచి ఒకరు, వైసీపీ నుంచి ఒకరు కార్పొరేటర్లు మృతి చెందారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు సైతం వైసిపికి ఇటీవల మద్దతు పలకడంతో వారితో కలుపుకొని ప్రస్తుతం వైసిపికి 60 మంది కార్పొరేటర్లు ఉండగా.. టిడిపికి 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

అయితే టీడీపీలో ఇద్దరు కార్పొరేటర్లు ఇటీవల పార్టీకి కాస్త దూరంగా ఉన్నట్టు కనిపిస్తుండడంతో వారి ఓటింగ్ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నిన్న నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వైసిపి కార్పొరేటర్ తో మంత్రి అవంతి వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ కార్పొరేట్లకు దశ దిశా నిర్దేశం చేశారు. స్టాండింగ్ కమిటీ ఓటింగ్ కి సంబంధించి తమ పార్టీ కార్పొరేటర్లు వైసిపి కే ఓటు వేసేలా విప్ జారీ చేయనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు ,పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లో టిడిపి సైతం బరిలో ఉండటం పట్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బలం లేకపోయినా టిడిపి పోటీలో ఉండటం మంచి సాంప్రదాయం కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. టిడిపి అభ్యర్థులు ప్రపోజల్స్ ని విత్ డ్రా చేసుకుంటే చంద్రబాబుకి గౌరవం పెరుగుతుందన్నారు.చంద్రబాబు నాయుడుకు ఇంకా మార్పు రాకపోవడం బాధాకరం అని మంత్రి అవంతి మండిపడ్డారు. మొత్తానికి టిడిపి సైతం బరిలోకి దిగడంతో GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక అనివార్యమైంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో బుధవారం జివిఎంసి స్థాయి సంఘం ఎన్నిక జరుగనుంది.

Read also :  AP Farmers : రైతులతో కలిసి దేవినేని ఉమ నిరసన.. ధాన్యం, మొక్కజొన్న రైతుల పంట డబ్బు వెంటనే చెల్లించాలని డిమాండ్