ఈ ద్వీపం మహిళలకు మాత్రమే.. వివాహం నుంచి అంత్యక్రియల వరకు అన్నీ వారే.. ఎందుకో తెలుసా..?

Women Special: కొంతమంది పురుషులు.. మహిళలు ఇంటిని మాత్రమే నిర్వహించగలరని భావిస్తారు. వారు ఉద్యోగాలు చేయలేరని, రోజువారీ పనులు నిర్వహంచలేరని,

ఈ ద్వీపం మహిళలకు మాత్రమే.. వివాహం నుంచి అంత్యక్రియల వరకు అన్నీ వారే.. ఎందుకో తెలుసా..?
Kihnu Island
Follow us

|

Updated on: Nov 12, 2021 | 7:33 PM

Women Special: కొంతమంది పురుషులు.. మహిళలు ఇంటిని మాత్రమే నిర్వహించగలరని భావిస్తారు. వారు ఉద్యోగాలు చేయలేరని, రోజువారీ పనులు నిర్వహంచలేరని, ఇంటిని మాత్రమే నడపగలరని ఎగతాళి చేస్తారు. కానీ గత కొన్నేళ్లుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నారు. తాము ఎవరికన్నా తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ రోజు మనం 90 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న గ్రామం గురించి తెలుసుకుందాం.

ఎస్టోనియాలోని ఐలాండ్ ఆఫ్ ఉమెన్ అనేది ఒక ప్రత్యేకమైన గ్రామం. ఈ ద్వీపం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ద్వీపం బాధ్యత మొత్తం వారే చూసుకుంటారు. ఈ ద్వీపంలో సుమారు 300 మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు. ఇప్పుడు మీ మదిలో ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. ఇక్కడ మహిళలందరు అవివాహితులు అయి ఉంటారని కానీ ఇది నిజం కాదు. ఇక్కడ నివసిస్తున్న స్త్రీల భర్తలు, కుటుంబ పురుషులు ఉద్యోగాలు చేయడం కోసం ఎస్టోనియాలో ఉంటారు. దీని కారణంగా ఇక్కడ మహిళలు మాత్రమే నివసిస్తారు. అందుకే ఇక్కడి పనులన్నీ మహిళలు మాత్రమే చేస్తారు.

యునెస్కో జాబితాలో ఈ ద్వీపం యొక్క పేరు UNESCO జాబితాలో కూడా చేరింది. నేరం, బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే ఈ ద్వీపంలో నివసించడానికి ప్రవేశం కల్పిస్తారు. ఈ ద్వీపంలో నివసించే స్త్రీలు ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పురుషులు చేతివృత్తులు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. ఈ ద్వీపంలో మహిళలకు మాత్రమే వివాహం జరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజల అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత కూడా వీరికే ఉంటుంది. మాతృస్వామ్యం, ఆచార వ్యవహారాల వల్ల ఇక్కడి ప్రజలు ఈ పనులను నిర్వహిస్తారు.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ద్వీపాన్ని దాదాపు 50 సంవత్సరాలు సోవియట్ యూనియన్ ఆక్రమించింది. అప్పుడు ఇది మహిళల ఆధిపత్యంలో ఉంది. ప్రపంచీకరణ ప్రభావం ఈ దీవిపై కూడా పడింది. మారుతున్న కాలంతో ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఈ దీవి నుంచి బయటకు వెళ్లి చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక సంప్రదాయం మెల్లమెల్లగా దూరం కావడానికి ఇదే కారణం.

35 తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! అయితే మీరు వీటిని పాటించడం లేదు..?

పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?