Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! అయితే మీరు వీటిని పాటించడం లేదు..?

Beauty Tips: ఇంటర్నెట్ ప్రపంచం ప్రజలను చాలా వేగంగా ముందుకు తీసుకువెళుతోంది. దీనివల్ల ప్రజలు సొంత అవసరాలకు సమయం కేటాయించడం లేదు. ఉద్యోగం,

35 తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! అయితే మీరు వీటిని పాటించడం లేదు..?
Skin Care
Follow us
uppula Raju

|

Updated on: Nov 12, 2021 | 7:28 PM

Beauty Tips: ఇంటర్నెట్ ప్రపంచం ప్రజలను చాలా వేగంగా ముందుకు తీసుకువెళుతోంది. దీనివల్ల ప్రజలు సొంత అవసరాలకు సమయం కేటాయించడం లేదు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్యే రోజంతా గడిచిపోతుంది. అదే సమయంలో ప్రజల ఆహారం కూడా చాలా చెడ్డదిగా మారింది. దీని ప్రభావం ఆరోగ్యం, చర్మంపై చూపడం ప్రారంభించింది. ఈ రోజుల్లో 35 ఏళ్లు దాటాయంటే మొహంపై ముడతలు వస్తున్నాయి. వయస్సు ప్రభావం సమయం కంటే ముందుగానే చర్మంపై కనిపిస్తుంది. మహిళలు ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన క్రీములను వాడుతున్నా దాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తప్పడం లేదు. మీ చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి రక్షించాలంటే ఈ పద్దతులు పాటించాలి.

1. వీటిని ఆహారంలో చేర్చుకోండి ఆహారం మన ఆరోగ్యం, అందంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మీ సహజ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పండ్లను చేర్చండి. ఇది కాకుండా అవిసె గింజలు, బాదం, అత్తి పండ్లను, వాల్నట్లను తినండి.

2. పుష్కలంగా నీరు తాగాలి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి చర్మానికి మెరుపును తెస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 4 లీటర్ల నీరు తాగాలి.

3. సన్‌స్క్రీన్ క్రీమ్ రాయాలి.. సూర్యుని హానికరమైన కిరణాల కారణంగా చర్మంపై అనేక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని నివారించడానికి సన్‌స్క్రీన్ క్రీమ్ అప్లై చేయడం అవసరం. ఎండలో బయటకు వెళ్లినప్పుడు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచాలి.

4. చర్మాన్ని లోతుగా శుభ్రం చేయాలి.. బయట తిరిగి వచ్చిన తర్వాత చర్మాన్ని లోతుగా శుభ్రం చేయాలి. ఎందుకంటే బయట ఉన్న దుమ్ము మన చర్మ రంధ్రాల్లో నిండిపోతుంది. లోతైన ప్రక్షాళన కోసం మంచి క్లెన్సర్‌ని ఉపయోగించండి. ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి.

5. చర్మాన్ని తేమగా ఉంచాలి.. చర్మంపై ముడతలు రావడానికి చర్మాన్ని తేమగా ఉంచకపోవడం కూడా ఒక కారణం. దీని వల్ల చర్మం నిర్జీవంగా మారి ముడతలు ఏర్పడుతాయి. వీటిని నివారించడానికి నాణ్యత గల మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం అవసరం.

6. ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర నిద్ర లేకపోవడం వల్ల ముఖం పాలిపోయి, కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తాయి. అలాంటి సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. ఇది కాకుండా క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలి.

పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?

ఎంబీఏలో సీటు రాకపోతే చింతించవద్దు.. మీ కోసం ఈ కోర్సు ఎదురుచూస్తుంది.. మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం..