ఎంబీఏలో సీటు రాకపోతే చింతించవద్దు.. మీ కోసం ఈ కోర్సు ఎదురుచూస్తుంది.. మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం..

Career News: మీరు ఎంబీఏ అడ్మిషన్ కోసం CAT పరీక్షను క్లియర్ చేయలేకపోయారా, MBA చదవడానికి మీ దగ్గర డబ్బులు లేవా.. అయితే అస్సలు చింతించకండి. ఎందుకంటే

ఎంబీఏలో సీటు రాకపోతే చింతించవద్దు.. మీ కోసం ఈ కోర్సు ఎదురుచూస్తుంది.. మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం..
Pgdm
Follow us
uppula Raju

|

Updated on: Nov 12, 2021 | 5:23 PM

Career News: మీరు ఎంబీఏ అడ్మిషన్ కోసం CAT పరీక్షను క్లియర్ చేయలేకపోయారా, MBA చదవడానికి మీ దగ్గర డబ్బులు లేవా.. అయితే అస్సలు చింతించకండి. ఎందుకంటే MBA లేకుండా కూడా మేనేజ్‌మెంట్ చదవాలనే మీ కల నెరవేరుతుంది. MBAకి బదులు మీరు PGDM కోర్సు చేసే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (PGDM) ద్వారా మీ కల నెరవేరుతుంది. ఈ కోర్సు విలువ MBA డిగ్రీకి సమానం. పీజీడీఎం కోర్సు చేయడం ద్వారా మంచి ప్యాకేజీతో మంచి కంపెనీలో ఉద్యోగం పొందవచ్చు. భారతదేశంతో సహా అనేక దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

PGDM కోర్సు ఎలా చేయాలి.. ఎక్కడ నుంచి చేయాలి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి మీరు PGDM కోర్సులో చేరవచ్చు. దీని కోసం మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. చాలా యూనివర్సిటీల్లో ఈ కోర్సులో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించింది.

అదే సమయంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఇందులో అడ్మిషన్ కోసం చిన్న ప్రవేశ పరీక్ష లేదా ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నాయి. దీని ఆధారంగా వారు విద్యార్థులకు ప్రవేశం కల్పి్స్తున్నారు. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండగా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు వాటిని డిస్టెన్స్‌, ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ కోర్సు ద్వారా మేనేజ్‌మెంట్ చదువవచ్చు.

ఉద్యోగం ఎలా పొందాలి PGDM కోర్సు చేసిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న అందరికి వస్తుంది. ఈ కోర్సు చేసిన తర్వాత మేనేజ్‌మెంట్ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మేనేజ్ మెంట్ చదివిన వాళ్లు ప్రతి రంగంలోనూ కావాలి. అనేక ఇన్‌స్టిట్యూట్‌లు, విశ్వవిద్యాలయాలు కోర్సులో ఉత్తీర్ణులైన వారికి ప్లేస్‌మెంట్ కోసం ఏర్పాట్లు చేస్తాయి. అంతేకాదు దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందవచ్చు.

చాలా ప్రభుత్వ కంపెనీలకు (Govt కంపెనీలు) మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు అవసరం. ఎప్పటికప్పుడు ఖాళీలు ఉంటూనే ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పరీక్షలు, ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపాలి. ఇది కాకుండా మీరు PGDM కోర్సు చేసిన తర్వాత MBA డిగ్రీని కూడా చేయవచ్చు. PGDM కోర్సు తర్వాత MBA డిగ్రీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. చాలా యూనివర్సిటీలు పీజీడీఎం చేసిన వారికి లాటరల్ ఎంట్రీ ద్వారా ఎంబీఏలో ప్రవేశం కల్పిస్తున్నాయి.

మీరు హిల్‌ స్టేషన్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..

పెరిగిన కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు.. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..