NHAI Recruitment: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ..

NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ 6, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
* ఫైనాన్స్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీకామ్/ సీఎంఏ/ ఎంబీఏలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Know This: చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..? వీడియో
Viral Video: మరిది పెళ్లిలో వదిన సూపర్ డ్యాన్స్… నెట్టింట వీడియో వైరల్..