Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIM Recruitment 2021: తిరుచిరపల్లి ఐఐఎంలో నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. లక్ష వరకు జీతం పొందే అవకాశం..

IIM Recruitment 2021: తిరుచిరపల్లిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను...

IIM Recruitment 2021: తిరుచిరపల్లి ఐఐఎంలో నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. లక్ష వరకు జీతం పొందే అవకాశం..
Iim Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 12, 2021 | 8:35 PM

IIM Recruitment 2021: తిరుచిరపల్లిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కార్పొరేట్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, ఎస్టేట్‌ మేనేజర్, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, ఐటీ సపోర్ట్‌ ఇంజనీర్, ఐటీ టెక్నికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), హిందీ సూపర్‌వైజర్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్, ఎడిటోరియల్‌ అసిస్టెంట్, అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీఎం, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్స్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35-63 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. రూ.25,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.

* అభ్యర్థులను రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 24-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Cinema News: నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Hyderabad: హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..

Hyderabad: నువ్వు గ్రేట్‌ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..