Cinema News: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
'మ్యాస్ట్రో' వంటి థ్రిల్లర్ మూవీ తర్వాత యూత్‌స్టార్ నితిన్ నటిస్తో్న్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది..

‘మ్యాస్ట్రో’ వంటి థ్రిల్లర్ మూవీ తర్వాత యూత్‌స్టార్ నితిన్ నటిస్తో్న్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ‘ఉప్పెన’ ఫేం కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పేరుతోనే సినిమా ప్రియుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలోకి ‘మాచర్ల నియోజకవర్గం’ వస్తుందని సోషల్ మీడియాలో పంచుకుంది.
దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో రౌడీలతో తలపడుతూ ఎంతో రౌద్రంగా కనిపిస్తున్నాడు నితిన్. లవ్, పొలిటికల్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నితిన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నితిన్ నటించిన ‘భీష్మ’, ‘మ్యాస్ట్రో’ సినిమాలకు సంగీత స్వరాలు అందించిన మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ మూడోసారి ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నాడు.
Also read:
Samantha: ‘మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి’.. వైరల్ అవుతోన్న సమంత పోస్ట్
Raja Vikramarka Review: ఫక్తు కమర్షియల్ సినిమా రాజా విక్రమార్క