Petrol And Diesel Prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆర్థికవ్యవస్థపై ప్రభావం.. వెల్లడించిన క్రిసిల్ నివేదిక..
మన ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడి పడి ఉంది. అందులో ఏ ఒక్కటి సరిగలేకపోయినా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇండియాలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి...

మన ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడి పడి ఉంది. అందులో ఏ ఒక్కటి సరిగలేకపోయినా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇండియాలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇంధన ధరలలో హెచ్చుతగ్గులు అధిక ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంటుంది. చమురు ధరలు పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఫలితంగా మార్కెట్‌కు చేరే వస్తువులు మరింత ఖరీదు అవుతాయి. ఇంధన ధరలు నేరుగా దేశంలో సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతాయి. సగటు భారతీయ కుటుంబాల బడ్జెట్‌లో ఇంధన ధరలు ఎందుకు ముఖ్య పాత్రను పోషిస్తాయి? దేశంలో జీవన వ్యయం ఏ స్థాయిలో పెరిగింది. క్రిసిల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది కాలంలో అగ్రి ఉత్పత్తులు, సిమెంట్, ఎఫ్‌ఎంసీజీ నుంచి స్టీల్, టెక్స్‌టైల్స్ వరకు అన్నీంటి ధరలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఇంధన ధరలు పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్) పై ఎక్కువ ప్రభావం పడింది. రవాణా ఛార్జీలు పెరగటంతో వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అక్టోబర్ 2020లో దేశవ్యాప్తంగా సగటు సరకు రవాణా ఖర్చు రూ. 100గా ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ ఖర్చు పెరిగింది. ఆ తేడాను సులభంగా చూడవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేయడానికి అక్టోబర్ 2020 లో రూ.106 ఖర్చు కాగా ఇప్పుడు రూ.128కు పెరిగింది. సిమెంట్ రవాణా రూ.105కు నుంచి రూ.142కు పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ రవాణా ఖర్చు రూ.135 నుంచి రూ.141కు పెరిగింది. స్టీల్ రవాణా ఖర్చు రూ.85 నుంచి 104కు పెరిగాయి. దుస్తులు రవాణా ఖర్చు రూ. 84 నుంచి రూ.111కు పెరిగింది. కోవిడ్ కారణంగా సరుకు రవాణా రేట్లు పెంచినప్పటికీ, ఇంధన ధరల పెరుగుదలతో రవాణాదారులు గణనీయమైన లాభం పొందలేదని నివేదిక పేర్కొంది.
Read Also.. EPFO: ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..