SBI Debit Card: ఎస్బీఐ ఏటీఎం కార్డ్ పోయిందా.. అయితే వెంటనే ఇలా బ్లాక్ చేయండి..
SBI Debit Card: చాలామంది అనుకోని పరిస్థితులలో డెబిట్ కార్డులని పోగొట్టుకుంటారు. అలాంటి సమయంలో వారు చాలా కంగారు పడుతారు. అకౌంట్లోని డబ్బులు మొత్తం
SBI Debit Card: చాలామంది అనుకోని పరిస్థితులలో డెబిట్ కార్డులని పోగొట్టుకుంటారు. అలాంటి సమయంలో వారు చాలా కంగారు పడుతారు. అకౌంట్లోని డబ్బులు మొత్తం కాజేస్తారేమోనని భయపడుతారు. అలాంటి సమయంలో ఏం చేయాలో ఎస్బీఐ సూచించింది. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్‌లను పోగొట్టుకున్నట్లయితే వెంటనే చేయవలసిన పని మీ కార్డ్‌ని బ్లాక్ చేయడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల ఒకరి పాత డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేసే ప్రక్రియను, కొత్త దాన్ని తిరిగి ఎలా జారీ చేయాలో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. దాని గురించి తెలుసుకుందాం.
మొదటగా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 1234కు కాల్ చేయాలి. అందులో చెప్పిన విధంగా నిర్దిష్ట అంకెలను నొక్కుతూ ఉండాలి. కార్డ్ బ్లాకింగ్ కోసం SBI కస్టమర్ 0 నొక్కాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కార్డ్ నంబర్‌ని ఉపయోగించి డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడానికి 1 నొక్కాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఖాతా నంబర్‌ని ఉపయోగించి కార్డ్‌ని బ్లాక్ చేయడానికి 2 నొక్కాల్సి ఉంటుంది.
ఖాతా నంబర్‌ని ఉపయోగించి డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడానికి కొన్ని సాధారణ పద్దతులను అనుసరించాలి. అవి కింది విధంగా ఉంటాయి.
1. కార్డ్‌ని బ్లాక్ చేయడానికి ఖాతా నంబర్‌లోని చివరి ఐదు అంకెలను నమోదు చేయాలి 2. చివరి ఐదు అంకెలను నిర్ధారించడానికి 1ని నొక్కాలి. 3. ఖాతా నంబర్‌లోని చివరి ఐదు అంకెలను మళ్లీ నమోదు చేయడానికి ఇప్పుడు 2ని నొక్కాలి. 4.ఈ దశలు పూర్తయిన తర్వాత డెబిట్ కార్డ్ విజయవంతంగా బ్లాక్ అవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు బ్లాక్ అయినట్లుగా SMS వస్తుంది.
ఒక SBI కస్టమర్ ATM కార్డ్ చివరి ఐదు అంకెలను గుర్తుంచుకుంటే కింది పద్దుతులను ఉపయోగించి డెబిట్ కార్డ్‌ను బ్లాక్ చేయవచ్చు
1. ATM కార్డ్‌లోని చివరి ఐదు అంకెలను నమోదు చేయాలి. 2. ఇప్పుడు నిర్ధారించడానికి 1ని నొక్కాలి 3. ఇప్పుడు బ్లాక్ చేయబడే ATM కార్డ్‌లోని చివరి ఐదు అంకెలను మళ్లీ నమోదు చేయడానికి 2ని నొక్కాలి 4. ఈ దశలు పూర్తయిన తర్వాత డెబిట్ కార్డ్ విజయవంతంగా బ్లాక్ అవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు బ్లాక్ అయినట్లుగా SMS వస్తుంది.
Here’s how you can block your Debit Card and reissue a new one via our toll-free IVR system.
Just call 1800 1234.#SBI #StateBankOfIndia #IVR #DebitCard pic.twitter.com/QMXUNCc9u0
— State Bank of India (@TheOfficialSBI) November 11, 2021