RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?

RBI Special Coins: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణంగా చెలామణిలో ఉండవు. ఇవి కేవలం

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?
250 Coin
Follow us
uppula Raju

|

Updated on: Nov 12, 2021 | 6:07 PM

RBI Special Coins: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణంగా చెలామణిలో ఉండవు. ఇవి కేవలం మెమరీగా మాత్రమే ఉంటాయి. ఇటువంటి నాణేలు మహాపురుషుల జయంతి లేదా ఏదైనా ప్రత్యేక రోజున జారీ చేస్తారు. ఈ నాణేలు వేర్వేరు విలువలను కలిగి ఉంటాయి. వీటిలో రూ.75, రూ.100, రూ.150, రూ.250 నాణేలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా నాణేలు ఉన్నాయి. ప్రజలు ఇలాంటి ప్రత్యేక నాణేలను పొందాలనుకుంటే సులభంగా తీసుకోవచ్చు. RBI నుంచి ఈ నాణేలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఈ నాణేలు ఎలా ఉంటాయి? ఈ నాణేలను వెండితో తయారు చేస్తారు. ప్రత్యేక కార్యక్రమాలలో ప్రత్యేక సందర్భాలలో జారీ చేస్తారు. ఆ ప్రత్యేక సందర్భం గురించిన సమాచారం కూడా నాణెంపై ఉంటుంది. ఇది ఒక విధంగా RBI నుంచి నివాళిలాంటిది. 1. మదర్ థెరిసా జయంతి సందర్భంగా 100 రూపాయల నాణెం విడుదలైంది. 2. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా 150 రూపాయల నాణెం విడుదలైంది. 3. శ్యామచరణ్ లాహిరి కోసం రూ.125 నాణెం విడుదలైంది. 4. రాజ్యసభ 250వ సెషన్‌లో రూ.250 నాణెం విడుదలైంది. 5. ఇవే కాకుండా చాలా సందర్భాలలో నాణేలు విడుదల చేశారు.

ఈ నాణేలు ఎలా పొందగలరు.. ఎవరైనా నాణెం తీసుకోవాలనుకుంటే మీరు దానిని ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవచ్చు. మీరు సెక్యూరిటీస్ ప్రింటింగ్, కరెన్సీ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ మీరు నాణేల లింక్‌లను చూస్తారు సాధారణ ఆన్‌లైన్ షాపింగ్ లాగా కొనుగోలు చేయవచ్చు. ఈ నాణేలు వెండితో కూడి ఉంటాయి ప్రతి నాణెం ఆధారంగా దాని ధర ఉంటుంది. కాబట్టి మీరు దానిని సులువుగా కొనుగోలు చేయవచ్చు.

50 పైసల కాయిన్‌ చెలామణిలో ఉందా.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ పూర్తి సమాచారం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో 50 పైసలు, 1 రూపాయి, 2, 5, 10, 20 రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. 50 పైసల నాణెం చెలామణిలో లేదని ఆర్‌బిఐ ఇంకా ప్రకటించలేదు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. వీటిని తీసుకోవడానికి ఎవరూ నిరాకరించవద్దు.

ఎంబీఏలో సీటు రాకపోతే చింతించవద్దు.. మీ కోసం ఈ కోర్సు ఎదురుచూస్తుంది.. మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం..

మీరు హిల్‌ స్టేషన్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..