మీరు హిల్‌ స్టేషన్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..

Travel Tips: దేశంలో చాలా నగరాలు అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. అందుకే చాలామంది సెలవులు దొరికితే చాలు చల్లటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అందులో ముఖ్యమైనవి

మీరు హిల్‌ స్టేషన్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..
Travel Tips
Follow us
uppula Raju

|

Updated on: Nov 12, 2021 | 5:20 PM

Travel Tips: దేశంలో చాలా నగరాలు అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. అందుకే చాలామంది సెలవులు దొరికితే చాలు చల్లటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అందులో ముఖ్యమైనవి హిల్‌ స్టేషన్లు. సిమ్లా, మనాలి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఒకవేళ మీరు భారతదేశంలోని ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా కొన్ని వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

1. తోలు జాకెట్‌, స్వెటర్ హిల్ స్టేషన్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో ఒక లెదర్ జాకెట్ తీసుకువెళ్లండి. ఎందుకంటే ఈ జాకెట్ మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు స్వెటర్లను కూడా తీసుకువెళితే మంచిది.

2. మఫ్లర్ లేదా క్యాప్ చాలా సమయం స్వెటర్లు ధరించడం వల్ల అలర్జీలు వస్తాయి. కాబట్టి మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మఫ్లర్ లేదా క్యాప్ ఉంటే మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు తేలికగా ఉంటాయి.

3. అత్యవసర నంబర్లు మీరు వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ నంబర్లను గుర్తుంచుకోండి. మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లబోతున్నట్లయితే అత్యవసర నంబర్‌లను కచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాలి. తద్వారా మీరు అపాయంలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు.

4. ప్రథమ చికిత్స కిట్‌ మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు గాయపడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంటే చికిత్స చేయవచ్చు. అందుకే దీనిని మరిచిపోవద్దు.

5. సెల్ఫీ స్టిక్, డిజిటల్ కెమెరా డిజిటల్ కెమెరా అనేది మీ ట్రిప్‌ను చాలా ప్రత్యేకంగా మార్చగలదు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్నట్లయితే కెమెరాతో పాటు మీతో సెల్ఫీ స్టిక్ తీసుకోవడం మర్చిపోవద్దు. చాలా సార్లు మీరు ఒంటరిగా తిరుగుతూ ఉంటారు అప్పుడు సెల్ఫీ స్కిట్ మీకు చాలా అవసరమవుతుంది.

అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..

Post Office: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పోస్టాఫీసు ద్వారా సంపాదించే అవకాశం..

పెరిగిన కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు.. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..