Onake Obavva: చిత్రదుర్గ కోటపై కన్నేసిన హైదర్ ఆలీకి రోకలి బండతో చుక్కలు చూపిన వీర వనిత ‘ఒనకే ఓబవ్వ’ జయంతి నేడు..
Onake Obavva: భారతదేశం అసమాన వీర వనితలకుల జన్మనిచ్చిన పుణ్యభూమి. చరిత్ర చెప్పని అనేక మంది వీరవనితలు ఉన్నారు మనదేశంలో. అయితే తాజాగా కర్ణాటక..

Onake Obavva Jayanthi: భారతదేశం అసమాన వీర వనితలకుల జన్మనిచ్చిన పుణ్యభూమి. చరిత్ర చెప్పని అనేక మంది వీరవనితలు ఉన్నారు మనదేశంలో. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి చిత్రదుర్గ కోటను కాపాడిన “ఒనికే ఓబవ్వ” జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జరిపింది. నవంబర్ 11న ఓబవ్వ పరాక్రమాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించింది. ఇకపై కూడా కర్ణాటక ప్రభుత్వం “ఒనికే ఓబవ్వ” జయంతిని కర్నాటక ప్రభుత్వం అధికారికంగా జరుపబోతుందని ప్రకటించింది. 18వ శతాబ్దంలో చిత్రదుర్గలో హైదర్ అలీ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళా-సైనికురాలు ఒనకే ఓబవ్వ ని స్మరించుకుందాం.. వీర వనిత గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒనకే ఓబవ్వ ఎవరంటే.. ? ఆమె పేరు.. చిత్రదుర్గ కోటకు ఎంత పర్యాయపదంగా ఎందుకు మారిందో దాదాపు ప్రతి కన్నడిగుడికి తెలుసు. సాహిత్యం, సినిమాలు, కళల ద్వారా ఆమెను పదే పదే గుర్తుంచుకుంటారు. ఓబవ్వ చరిత్ర ప్రసిద్ధ కథ కర్ణాటక జానపద కథల్లో ఇమిడి ఉంది. ప్రస్తుత కర్ణాటకలోని చిత్రదుర్గలోని కోట 18వ శతాబ్దంలో మదార్కి నాయక్ పాలించారు. 1716 వ సంవత్సరం.. చిత్రదుర్గం కోటపై ఎగురుతున్న భగవధ్వజాన్ని, కోట వైభవాన్ని చూసిన ముస్లిం రాజు హైదర్ అలీ మనసు పడ్డాడు. దీంతో చిత్రదుర్గ కోటను స్వాధీనం చేసుకోవడానికి, మదార్కి నాయక్ ని ఓడించడానికి పదేపదే ప్రయత్నించాడు. ఎలాగైనా ఈ దుర్గాన్ని వశపరుచుకుంటే చాలు మిగిలిన కోటలను చిటికలో జయించ వచ్చు అనుకున్నాడు. అయితే హైదర్ ఎన్ని సార్లు దండెత్తినా సమర్థవంతంగా తిప్పగొడుతున్నాడు. కోటలో సైన్యం ప్రవేశించడానికి వీలు లేకుండా చేశారు.
చాలా ఎక్కువ సైన్యంతో హైదర్ అలీ చిత్రదుర్గపై దాడి చేయడానికి బయలుదేరాడు. దుర్గం వెలుపల విడిది చేసి దాడి మొదలు పెట్టారు. దాడి గంటలు దాటి రోజులు నెలలు సాగింది. కోట వశం కాలేదు. కోటలో పుష్కలంగా ఆయుధాలు, ఆహారం, నీటి బావులు ఉన్నాయి. అయితే హైదర్ అలీ సైన్యానికి తెచ్చుకున్న వన్నీ కొరత పడ్డాయి. ఏదైనా రహస్య మార్గం ద్వార కోటలోకి జొరపడాలి అనే ఆలోచన చేసాడు. అదే సమయంలోఒకరోజు, హైదర్ అలీకి తన గూఢచారి నుండి చిత్రదుర్గ రాతి కోటలో ఒక వ్యక్తి ప్రవేశించడానికి ఒక రంధ్రం ఉందని సందేశం వచ్చింది. ఉప్పొంగిన హైదర్ అలీ తన మనుషులను ఒక్కొక్కరిగా కోట లోపలికి పంపి ఇరువైపుల నుండి దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం, హైదర్ అలీ తన ప్రణాళికను అమలు చేయడానికి తన సైనికులను పంపాడు. అయితే రంధ్రం దానిలోని ఒకరొకరుగా ప్రవేశించారు.
అయితే ఆ రంధ్రానికి ‘ఓబా’ కాపలాదారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఓబవ్వ తన భర్తను భోజనానికి పిలిచింది. అతను ఇంట్లోకి వెళ్లాడు. భార్యతో కోట చుట్టూ హైదర్ సైనికులు వున్నారు ఎప్పుడూ అప్రమత్తం గా ఉండాలి త్వరగా భోజనం పెట్టు వెళ్లాలి అన్నాడు. ఆమె అతనికి ఆహారం అందించింది మరియు తను తాగునీరు తీసుకోవడం మర్చిపోయిందని గ్రహించింది. ఓబా భార్య ‘ఓబి’ అతనికి భోజనం వడ్డించి మీరు తింటూ వుండండి! బావి వద్ద మంచినీరు తెస్తానని బిందె తీసుకొని బావి వద్దకు వచ్చింది. మార్గమధ్యంలో, శత్రు సైనికులు ఒక రంధ్రం గుండా కోట లోపలికి ప్రవేశించడాన్ని ఓబి గమనించింది. ఆమె తన భర్తను అప్రమత్తం చేయడానికి ఇంటికి తిరిగి వచ్చింది. అతను భోజనం చేస్తుండడంతో.. ఓబి అటూ ఇటూ చూసింది. మూలన వున్న రోకలిబండ కన్పించింది. అది తీసుకొని బిలద్వారం చేరింది.
బండరాయికి ఒకవైపు నిలబడి, రంధ్రం నుంచి వస్తున్న సైనికుడి తలపై ఒనకేతో బలంగా కొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో ఆ సైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె శవాన్ని పక్కకు లాగింది. అలా మళ్లీ దెబ్బకు సైనికుడిని మట్టు బెడుతూండడంతో అక్కడ శవాల కుప్పలు పేరుకుపోతున్నాయి. కాస్సేపటికి బయటకు వెళ్లిన ఓబా వచ్చాడు. నీళ్లు తెస్తానని వెళ్లిన భార్య ఇంకా రాలేదేంటని పిలుస్తూ బావి వద్దకు వచ్చాడు. ఆశ్చర్యం.. నుదిటికి పట్టిన చమటని కొంగుతో తుడుకొని రోకలి ఎత్తి పట్టి వీరమూర్తిలా ఉన్న భార్యని చూశాడు. ఓబా తన చేతిలోని వాయిద్యం తీసి గట్టిగా ఊదాడు. క్షణాలలో సైన్యం చేరుకుంది. మిగిలిన శత్రువులను మట్టు పెట్టి ఆ ద్వారాన్ని మూసేశారు. హైదర్ ఆశ అడియాశగా మిగిలి వెనక్కి మరిలిపోయాడు. ఓబవ్వ ఆ రోజు కోటను, ప్రజలను కాపాడింది.
ఆ తర్వత రాజు మదార్కీ నాయక్ కొలువు తీరారు.నిండు సభలో ‘ ఓబి’ ని పిలిపించి పలికారు. నీవు ఒక సైనికుని భార్యవి కావు ..మా అందరికీ తల్లివి. నిన్ను ఓబమ్మ తల్లిగా పూజించుకుంటామని సత్కరించాడు. ఇప్పటికీ చిత్రదుర్గ కోటలోని ఆ రహస్య మార్గానికి ‘వొంకేకండి’ (రోకలి బండ రహస్యమార్గం) గా పిలుస్తారు. ఇది ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఆమె ధైర్యసాహసాలు ఈనాటికీ కర్నాటకలోని పాఠశాలల్లో పిల్లలకు బోధింస్తున్నారు.
Also Read: ఇక్కడ గణపతి విగ్రహానికి కోట్లల్లో బీమా.. బంగారం కానుకగా ఇస్తే.. ధనవంతులవుతారని నమ్మకం..