Corona Vaccination: టీకా రెండు మోతాదులు తీసుకోకుండా తిరిగితే క్రిమినల్ కేసు.. ఆ జిల్లా కలెక్టర్ సంచలన ఆర్డర్స్!
కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. ప్రభుత్వాలన్నీ ప్రజలకు వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తిచేయాలనే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ, కొంతమంది ప్రజలు ఇప్పటికీ టీకా తీసుకోవడానికి రకరకాల కారణాలు చూపించి వెనుకడుగు వేస్తున్నారు.
Corona Vaccination: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. ప్రభుత్వాలన్నీ ప్రజలకు వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తిచేయాలనే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ, కొంతమంది ప్రజలు ఇప్పటికీ టీకా తీసుకోవడానికి రకరకాల కారణాలు చూపించి వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి వారి కోసం కొన్ని చోట్ల టీకాలు తీసుకుంటే బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొద్దిగా భయపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. అటువంటిదే ఇది కూడా. ”మీరు టీకా రెండు మోతాదులను ఇంకా తీసుకోకపోతే, వెంటనే దాన్ని పూర్తి చేయండి. లేకపోతె మీపై క్రిమినల్ కేసులు పెడతాం అని ఒక జిల్లా కలెక్టర్ కఠినమైన ఉత్తర్వులు జారీచేశారు. ఈ పని చేసింది సింగ్రౌలీ జిల్లా (మధ్యప్రదేశ్) కలెక్టర్. డిసెంబరు 15లోగా రెండు డోసులు టీకా తీసుకోకుండా బహిరంగ కార్యక్రమంలో, వివాహ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖ రేషన్ కోసం కుటుంబంలోని సభ్యులందరికీ రెండు డోసుల టీకాలు వేయడం తప్పనిసరి చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
మత, రాజకీయ కార్యక్రమాలు, వివాహాలు, సామాజిక కార్యక్రమాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి, సింగ్రౌలి జిల్లాలో కరోనా ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి, MP పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1949లోని సెక్షన్ 144 (1) మరియు సెక్షన్ 71 (1) మరియు 71 (2) ప్రకారం, డిసెంబర్ 15 లోపు, జిల్లా ప్రజలందరూ రెండు వ్యాక్సిన్‌లను పొందాలి. కరోనాను నిరోధించడానికి ఇది తప్పనిసరి.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే అక్కడి ప్రజలు సామాజిక, మత, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనగలరు. డిసెంబర్ 15 తర్వాత, వైద్య సలహా ద్వారా ఉపశమనం ఇవ్వాలని కోరిన వారికి మాత్రమే దీని నుండి మినహాయింపు ఉంటుంది. డిసెంబర్ 15 తర్వాత అలాంటి కేసులు వెలుగులోకి వస్తే, సెక్షన్ 188, 269, 270, 271, మధ్యప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్ 19 రెగ్యులేషన్ 2020, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 51 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
భారీ ప్రచారం..
కరోనా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో, బుధవారం ఒక్కరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 13.52 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇండోర్‌లో మొత్తం 72 వేల 700 మందికి టీకాలు వేశారు. రెండవ డోస్‌పై ఎక్కువ దృష్టి సారించారు. వ్యాక్సినేషన్ పై ప్రత్యెక శిబిరాలు 17, 24 నవంబర్, 1 డిసెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించానున్నారు. బుధవారం సాయంత్రం వరకు 13 లక్షల 52 వేలకు పైగా డోసులు వేశారు. వీటితో కలిపి మధ్యప్రదేశ్‌లో మొత్తం 7 కోట్ల 35 లక్షల 97 వేల 462 డోస్‌లు వేశారు. వీరిలో 5 కోట్ల 1 లక్షా 13 వేల 313 మంది మొదటి డోస్‌ను పొందగా, 2 కోట్ల 34 లక్షల 84 వేల మందికి పైగా పౌరులు రెండవ డోస్‌ను స్వీకరించారు.
ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..