Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తలెత్తిన పరిస్థితులకు సంబంధించి భారత్‌తో సహా 8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఎ) సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.

Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!
Nsa Meeting
Follow us
KVD Varma

|

Updated on: Nov 11, 2021 | 8:48 AM

Afghanistan Crisis:  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తలెత్తిన పరిస్థితులకు సంబంధించి భారత్‌తో సహా 8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఎ) సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఇరాన్, రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాలైన తజికిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్‌లకు చెందిన ఎన్‌ఎస్‌ఎ(NSA)లు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడ నుండి ఉగ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టాలని కోరుకుంటున్నాయి. సమావేశం అనంతరం ఎన్‌ఎస్‌ఏలందరూ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.

ఈ సమావేశానికి ‘ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్థాన్’ అని పేరు పెట్టారు. ఎన్‌ఎస్‌ఎ స్థాయి సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశానికి భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ నేతృత్వం వహించారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి పాకిస్థాన్, చైనా నిరాకరించాయి. షెడ్యూల్ సాకుతో సమావేశానికి హాజరు కావడానికి చైనా నిరాకరించింది.

ఏ దేశం ఏం చెప్పింది?

1. భారత్: ప్రాంతీయ దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ అన్నారు. ఈ సమావేశంలో చర్చలు ఫలవంతమవుతాయని తాము విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు.

2. తుర్క్‌మెనిస్తాన్: ఈ సమావేశం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం కనుగొని ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పగలమని తుర్క్‌మెనిస్తాన్ భద్రతా మండలి కార్యదర్శి చార్మిరత్ అమనోవి అన్నారు.

3. రష్యా: ఆఫ్ఘనిస్తాన్ సమస్యను పరిష్కరించడంలో అనేక పార్టీలు సమావేశమవుతున్న ఇటువంటి సమావేశాలు సహాయపడతాయని రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పెట్రుషెవ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు మనం కృషి చేయాలని ఆయన చెప్పారు.

4. కిర్గిజిస్తాన్: ఈ రోజు మన ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తం ముందు క్లిష్ట పరిస్థితి తలెత్తిందని భద్రతా మండలి కార్యదర్శి మరాట్ ఎం ఇమాంకులోవ్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాద సంస్థలు క్రియాశీలకంగా మారుతున్నాయి. మేము ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయం చేయాలని పేర్కొన్నారు.

5. తజికిస్తాన్: భద్రతా మండలి కార్యదర్శి నస్రుల్లో రహ్మత్జోన్ మహ్ముద్జోడా మాట్లాడుతూ.. పొరుగు దేశంగా, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయపడే అన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆఫ్ఘనిస్థాన్‌తో మనకు సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితి మన దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తుందని తమ భయాన్ని వ్యక్తం చేశారు.

6. ఇరాన్: భద్రతా మండలి సెక్రటరీ రియర్ అడ్మిరల్ అలీ శంఖానీ మా ముందు పెద్ద వలస సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని సమూహాల ప్రజలను ప్రభుత్వంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కరం అవుతుందని ఆయన చెప్పారు.

7. కజకిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై తాము ఆందోళన చెందుతున్నామని కజకిస్తాన్ జాతీయ భద్రత అధ్యక్షుడు కరీమ్ మాసిమోవ్ అన్నారు. అక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్నాయి. దేశం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.

8. ఉజ్బెకిస్తాన్: భద్రతా మండలి సెక్రటరీ విక్టర్ మఖ్ముదోవ్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పూర్తి శాంతిని పునరుద్ధరించడానికి మనం సమిష్టి పరిష్కారాన్ని కనుగొనవలసి ఉందని అన్నారు. అందరి కృషితోనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!

Paytm IPO: వాటా విక్రయాల్లో చరిత్ర సృష్టించిన పేటీఎం.. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే ఛాన్స్..!

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..